క్రీడాభూమి

కోహ్లీ నిర్ణయం సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనకుండా కౌంటీ క్రికెట్‌లో ఆడాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ సమర్థించాడు. వచ్చేనెలలో ఇంగ్లండ్ టూర్‌కు వెళుతున్న నేపథ్యంలో, కౌంటీ క్రికెట్‌లో ఆడటం వల్ల ప్రయోజనం ఉంటుందన్నాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. కోహ్లీ నిర్ణయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు వెంగ్ సర్కార్ స్పందిస్తూ, ‘ నిజంగా కోహ్లీ నిర్ణయం ఎం తో సముచితమైంది. కౌంటీల్లో ఆడటం వల్ల ఇంగ్లండ్ వాతావరణానికి అతడు అలవాటు పడతాడు. గతంలో జరిగిన ఇంగ్లండ్ టూరు కోహ్లీకి ఎంతమాత్రం సరిపడలేదు,’ అని గుర్తు చేశారు. గత కొద్ది సంవత్సరాల కాలంలో విరాట్ కోహ్లీ, ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్థానాన్ని చేరుకున్నాడు. సహజంగానే అతనిపై అందరికీ పెద్ద ఆశలే ఉంటాయి. అందుకనుగుణంగా అతను ఆడాలి కూడా. ఎవరి ఆశలను వమ్ముచేయడన్న నమ్మకం కోహ్లీపై ఉన్నదన్నారు. ‘నేనే గనక సెలక్టర్ అయినట్టయితే పుజారాను కూడా ఆగిపోయి, కౌంటీ (యార్క్‌షైర్)కోసం ఆడమని చెప్పేవాడిని. ఎందుకంటే వీళ్లు ఇంగ్లండ్‌లో ఆడా లి. భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆడటం వల్ల వీరికొచ్చే ప్రయోజనం ఏమీ లేదు’ అన్నాడు. ఇంగ్లండ్‌పై ఆడే మన జట్టు పూర్తి సమతౌల్యంతో ఉంది. కచ్చితంగా ఇంగ్లండ్‌పై నెగ్గితీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.