క్రీడాభూమి

టాప్స్‌లో చోటు దక్కని నారంగ్, రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఒలింపిక్స్ పతక సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ సోడియం స్కీమ్ (టాప్స్) ఎంతో ఆదరణ పొందుతుంది. వివిధ క్రీడాంశాల్లో ఆటగాళ్లు చూపే ప్ర తిభ ఆధారంగా ఈ స్కీంలో చోటు కల్పిస్తారు. ఈ క్రమంలో తా జాగా టాప్స్ నుంచి ఏస్ షూటర్ గగన్ నారంగ్, వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌లను తొలింగించింది. ఇటీవల ప్రతిభ ఆధారంగా టాప్స్‌కు ఎంపికైన క్రీడాకారుల్లో 12మందిని తప్పించిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో ఇటీవల కామనె్వల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన ఆరుగురు క్రీడాకారుల పేర్లను చేర్చారు. గగన్ నారంగ్‌తో పాటు హర్వీన్ సరావ్, పూజా ఘట్కర్, మేఘన సజ్జనార్, సత్యేంద్ర సింగ్, ఓంకార్ సింగ్, ప్రకాష్ నంజప్ప, రాగాల వెంకట రాహుల్, పూనమ్ యాదవ్, సతీష్ శివలింగం, లలితా బాబార్, గణపతిలు టాప్స్ నుంచి తొలగించిన జాబితాలో ఉన్నారు.
గాయం కారణంగా రాహుల్‌కు ఉద్వాసన..
గాయంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిప్టర్ రాగాల వెంకట్‌రాహుల్ పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) నుంచి తొలగించిన్నట్లు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమా ఖ్య(ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) స్పష్టం చేసింది. రాహుల్(85 కేజీలు)తో పాటు సతీష్ శివలింగం(77 కేజీలు) గాయాలతో బాదపడుతుండటంతో జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు పేర్కొంది. కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన వీరిద్దరూ వేగంగా కో లుకొని తిరిగి టాప్‌లో స్థానం పొందుతారని సమాఖ్య కార్యద ర్శి సహదేవ్ తెలిపాడు. జాతీయ శిక్షణ శిబిరం నుంచి చెప్పాపెట్టకుండా జాతీయ శిబిరానికి గైర్హాజరైన నేపథ్యంలో పూనమ్ యాదవ్‌ను కూడా తొలగించిన్నట్లు చెప్పాడు. ఈ ముగ్గురి స్థా నంలో సంజిత చాను(53 కేజీలు), పర్‌దీప్ సింగ్(105 కేజీలు), రాఖీ(63 కేజీలు)లను జాబితాలో చేర్చినట్లు వివరించాడు.
పోరాడి ఓడిన రోహన్ బొపన్న జోడీ
మాడ్రిడ్, మే 11: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో భారత్‌కు చెందిన రోహన్ బొప న్న, ఫ్రాన్స్‌కు చెందిన ఎడువార్డో రోజర్ వాసెలిన్‌ల జోడీ 6-4, 6-7(4/7), 5-10 తేడాతో సూపర్ టైబ్రేక్‌లో దక్షిణాఫ్రికాకు చెంది న రావెన్ క్లాసెన్ జంట చేతిలో ఓటమి పాలైంది. స్పె యిన్‌లోని మాడ్రిడ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ పురుషుల టబుల్స్ రెండో రౌండ్‌లో ఓటమి పాలైన బొపన్న జోడీకి 24,020 యూరోల (రూ.19లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. కాగా బొపన్న జోడీకి 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.