క్రీడాభూమి

మనుగడ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ప్లే-ఆఫ్ వేటలో ఇప్పటికే వెనుకబడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ఇప్పటికైనా పరిస్థితులకు అనుగుణంగా మారితే తప్ప ప్రయోజనం ఉండబోదు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఢీకొనబోతున్న ఆర్‌సీబీ, ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే గెలిచిన ఆర్‌సీబీ, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే-ఆఫ్‌ల్లో అవకాశాలను సజీవంగా ఉంచుకోగలదు. కాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్ ఛాన్స్‌ను కోల్పోయింది. ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్‌సీబీ పరుగుల తీరును చూస్తే ప్లేఆఫ్‌లకు వెళ్లే అవకాశాలు పెద్దగా కనిపించడంలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెదవి విప్పలేదు. ‘మా టీం ఉత్తమంగా లేదు’ అని ఊరుకున్నాడు. టీమ్ లీడర్ కోహ్లీ ఇప్పటి వరకు 49.50 సగటుతో 396 పరుగులు చేశాడు. కానీ 147 పరుగుల లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోవడం వల్ల కలిగిన షాక్ నుంచి ఇంకా కోహ్లీ తేరుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమ్ అధికంగా కోహ్లీ, ఎబి డె విల్లిస్‌లపైనే ఆధారపడాల్సి రావడం పెద్ద మైనస్ పాయింటు. ఇప్పటికైనా మణిదీప్ సింగ్, క్వింటన్ డి కాక్, బ్రెడన్ మెక్ కుల్లమ్‌లు ఉత్తమ ఆటను ప్రదర్శించాలి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆట ప్రదర్శన ఇప్పటి వరకు నిరుత్సాహ జనకంగా కొనసాగింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇతని ఎకానమీ రేటు 9.60 కావడం గమనార్హం. ఇక బ్యాటింగ్‌లోనూ వరుస వైఫల్యాల చరిత్రే కొనసాగింది. పేసర్లు టిమ్ సౌధీ, ఉమేశ్ యదవ్, మహమ్మద్ సిరాజ్‌లు కొంతవరకు రాణించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ శనివారం ఆడబోయే మ్యాచ్‌లో తన టీమ్ సభ్యులు నూటికి నూరుశాతం పనితీరు ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు. నిన్న ఢిల్లీలో సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై, ఇక ఐపిఎల్ నుంచి నిష్క్రమించే దశలో ఉన్న ఢిల్లీడేర్ డెవిల్స్‌తో ఆర్‌సీబీ శనివారం తలపడనుంది. ఇక రిషభ్ పంత్ చేస్తున్న కృషి ఢిల్లీ జట్టుకు సరిపోవడంలేదు. ఢిల్లీ జట్టుకు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇంకా చాలా ఆట ఉన్నదని అంటున్నప్పటికీ, అందులో నైరాశ్యం కనిపిస్తోంది. అయితే నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్ఛనే, దక్షిణాఫ్రికా పేసర్ జూనియర్ దాలాలకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. ‘మా స్క్వాడ్‌లో ఉన్న అందరితో వచ్చే 24 గంటల్లో చర్చలు జరుపుతాం. ఐపీఎల్ నుంచి మేం నిష్క్రమిస్తున్నప్పటికీ, వచ్చే మూడు మ్యాచ్‌లు గెలవడం మాకు ముఖ్యం’ అని హోప్స్ అన్నాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్‌ల ను ఓడిపోయాం. నిజంగా ఇది చాలా దురదృష్టక రం’ అని హోప్స్ అన్నాడు. ‘కాగిసోరబడ, క్రిస్ మోర్రిస్‌లు గాయపడ్డారు, మిగిలిన బౌలర్లతోనే నె ట్టుకొని రావాల్సి రావడం మాకు తలకుమించిన భా రమైంది’ అన్నాడు. కాకపోతే ఇవన్నీ ఆటలో భా గంగా పరిగణించక తప్పదని హోప్స్ అన్నాడు.