క్రీడాభూమి

ఏపీ కబడ్డీ అసోసియేషన్‌లో రచ్చ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాల్సిన క్రీడా సంఘాలు వ్యక్తిగత, స్వార్థ రాజకీయాలతో అభాసుపాలవుతున్నాయి. ఓవైపు ఆర్చరీ క్రీడాకారులు వ్యక్తిగత మనస్పర్థలతో రోడ్డెక్కి ఆర్చరీ క్రీడను అభాసుపాలు చేస్తుంటే తాజాగా కబడ్డీ అసోసియేషన్‌లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న లుకలుకలు రోడ్డెక్కాయి. రాష్ట్ర అసోసియేషన్‌లో అవినీతి, అక్రమా లు, క్రీడాకారిణులపై వేధింపులు కొనసాగుతున్నాయంటూ అసోసియషన్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ చేసిన ఆరోపణలకు స్పందించిన సీఎం చంద్రబాబు పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపధ్యంలో వేధింపులకు గురవుతున్నామని చెబుతున్న నల్గురు క్రీడాకారిణులను వెంట బెట్టుకుని శ్రీకాంత్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ను కల్సి ఫిర్యాదు చేశారు. వీర లంకయ్య అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా గత 20 ఏళ్లుగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ సర్ట్ఫికెట్లు విక్రయించుకుంటున్నారంటూ వీరు ఆ రోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెలుపలి నుంచి వచ్చినవారిని ఆడిస్తూ వారికి ధ్రువపత్రాలు విక్రయిస్తున్నారని బాధిత క్రీడాకారిణులకు న్యా యం జరగాలని శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ఇ దిలా ఉండగా అసోసియేషన్ బాధ్యులపై పలువు రు లైంగిక వేధింపుల ఆరోపణలూ చేస్తున్నారు. సర్ట్ఫికెట్ల విక్రయం ద్వారా ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

లైంగికంగా వేధిస్తున్నారు: క్రీడాకారిణులు
రాష్ట్ర కబడ్డీ క్రీడాకారిణుల జీవితాలను కాపాడాలంటూ పలువురు క్రీడాకారిణులు బాహాటంగా కో రుతున్నారు. డబ్బులు ఇస్తావా.. లేక వస్తావా అంటే అర్థం ఏమిటంటూ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్య తమను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తాను చెప్పిన చోటుకు రావాలంటుంటే దాని అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళ అనే గౌరవం లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని అదేమని ప్రశ్నిస్తే శిక్షణా శిబిరాల కు వెళ్లే అవకాశం లేకుండా అడ్డుపడుతున్నాడని వాపోతున్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో కృష్ణా కు చెందిన ఎం.నవ్య, కెఎల్‌వి రమణ, విశాఖకు చెంది న ధనలక్ష్మి, ఎస్.గౌతమి, పి.సునీత తదితరులు 20 ఏ ళ్లుగా ఆయన కబడ్డీ సంఘంలో పాతుకుపోవడమే వీ టన్నింటికీ కారణంగా అనేక మంది ఆరోపిస్తున్నారు.