క్రీడాభూమి

ఇరు జట్లకూ ప్రతిష్ఠాత్మకమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 12: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోని మొత్తం ఎనిమిది జట్లలో నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్, ఆరో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం హోరాహోరీ పోరు జరగనుంది. రెండు జట్లూ ప్లేఆఫ్‌కు చేరాలంటే తాము ఆడబోయే మిగిలిన కనీసం రెండు, మూడు మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ముంబయి, రాజస్తాన్ ఇంతవరకు 11 మ్యాచ్‌లు ఆడగా ఐదింట్లో విజయం, మరో ఆరింట్లో పరాజయం పాలయ్యాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు టీమ్‌లు 10 పాయింట్లతో ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ రెండు జట్టూ పడుతూ లేస్తూ వస్తూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి 102 అత్యధిక పరుగులతో విజయం సాధించింది. ఈ గెలుపు జట్టులో మంచి విశ్వాసం, నమ్మకాన్ని పెంచాయి. ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో తేల్చనుంది. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, బెన్ కటింగ్, కృణాల్ పాండ్య, హార్థిక్ పాండ్య, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్‌క్లీన్‌గన్, జేపీ డుమినీ వంటివారు మంచి ఫామ్‌లో ఉన్నారు. సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఒక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 94 పరుగులు చేసినా, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలో ఆశించిన స్కోరు చేయలేకపోయాడు. అయితే, ఆదివారం జరుగబోయే మ్యాచ్‌లో భారీ స్కోరు చేయడం ద్వారా సహచరుల్లో విశ్వాసం నింపితే బాగుంటుందని పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే సమర్థవంతమైన పాత్రను పోషిస్తే జోస్ బట్లర్‌తోపాటు కీలక క్రికెటర్లను కట్టడి చేయవచ్చు. ఇక రాజస్తాన్ రాయల్స్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ బట్లర్ ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్సీ ఇన్సింగ్ ఆడడంలో తరచూ విఫలమవుతున్నా, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, పేసర్ జయదేవ్ ఉనద్కత్ వంటివారు జట్టును ఆదుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి విజయం సాధించిన రాజస్తాన్ ఆదివారం ముంబయితో జరిగే చావోరేవో అనే పోరులో గట్టి పోటీనిస్తే మంచి ఫలితం ఉంటుంది.