క్రీడాభూమి

ప్లే ఆఫ్ కోసం చెన్నై తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 12: ప్లే ఆఫ్‌లో బెర్త్ ఖాయం చేసుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగే పోరులో గెలవడానికి చెన్నై సూపర్‌కింగ్స్ తహతహలాడుతోంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఒక పక్క బౌలింగ్, మరో పక్క బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా మ్యాచ్ ఆఖరి నిమిషంలో సైతం విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్న సన్‌రైజర్స్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్‌కు చేరాలంటే చెన్నై తప్పనిసరిగా తమ తదుపరి మూడు మ్యాచ్‌లలో కనీసం ఒక దాన్లోనైనా గెలవాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లోని మొత్తం ఎనిమిది జట్లలో తొలి స్థానాన్ని ఆక్రమించిన కేన్ విలియమ్‌సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ఇంతవరకు 11 మ్యాచ్‌లు ఆడగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్‌లలోనే పరాజయం పాలైన ఈ జట్టు పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇక చెన్నై ఇంతవరకు 11 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఏడింట్లో విజయం సాధించి, మరో నాలుగింట్లో పరాజయాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిని ఎదుర్కొంది.
ఈ మ్యాచ్‌లో 176 పరుగులు చేసినా బౌలర్ల లోపంతో ఓటమిని మూటకట్టుకున్నామని సాక్షాత్తూ ఆ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ అంగీకరించాడు. బ్యాటింగ్‌లో ధోనీ సహా షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేష్ రైనా, డ్వేన్ బ్రేవో తదితరులు మంచి ఫామ్‌లో ఉన్నా సన్‌రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటేనే పరుగుల వరద పారించగలరు. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (493 పరుగులు) తోపాటు స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ (290 పరుగులు) ఈ సీజన్‌లో అత్యధికంగా పరుగులు సాధించారు. అదేవిధంగా యూసుఫ్ పఠాన్ (186 పరుగులు), మనీష్ పాండే (184 పరుగులు), షాకీబ్ అల్ హసన్ (158 పరుగులు) వంటివారు సైతం జట్టును ఆదుకుంటున్నారు.
ముఖ్యంగా సన్‌రైజర్స్‌కు బౌలింగ్ ప్రధాన బలం. పేసర్ భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, సందీఫ్ శర్మ, రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్ వంటి బౌలర్లు అతి తక్కువ పరుగులకే ఔట్ చేయడం లేదా త్వరితగతిన పెవిలియన్ దారిపట్టించడంలో అగ్రగణ్యులు. చెన్నై, హైదరాబాద్ జట్టు దాదాపు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమాన బలాబలాలున్నా మ్యాచ్ ఎవరిని వరిస్తుందో వేచిచూద్దాం.