క్రీడాభూమి

బెంగళూరు ఖాతాలో మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్‌తో ఆడగా, మరో క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సైతం జూలు విదిల్చాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ శ్రమ వృథా అయింది. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికే తన పదునైన బ్యాటింగ్‌తో ఎంతోమంది మన్ననలు అందుకుంటున్న ఈ యువ సంచలనం శనివారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మైదానంలో చెలరేగి ఆడాడు. ఈ జట్టులో ఇతనొక్కడే 61 పరుగులు సాధించాడు. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ను ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించిన తొలి దశలోనే పృథ్వీ షా రూపంలో మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా కేవలం రెండు పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ చేతిలో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత మరో ఓపెనర్ జాసన్ రాయ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 12 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 34 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 61 పరుగులు చేసి, మోరుూన్ బౌలింగ్‌లో డివిలియర్స్ క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 35 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 32 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. విజయ్ శంకర్ 20 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 21, అభిషేక్ శర్మ 19 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మొయిన్ అలీ నాలుగు ఓవర్లలో 25, మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో 46 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 182 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ జట్టులో మొరుూన్ అలీ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఆరు పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 40 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 70 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇఛ్చాడు. మన్‌దీప్ సింగ్ 14 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 13 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. సర్ఫ్‌రాజ్ ఖానమ్ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 11 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చాడు. డివిలియర్స్ 37 బంతులు ఎదుర్కొని ఆరు సిక్సర్లు, మరో నాలుగు బౌండరీల సహాయంతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.