క్రీడాభూమి

రైడర్స్..అదుర్స్ -- హోల్కర్ మైదానంలో వీరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 12: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా అద్భుత ప్రదర్శన కనబరిచి, జట్టును ప్లే ఆఫ్ తీరాలకు చేరువ చేయడంలో కృతకృత్యులయ్యారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన క్రిస్ లీన్ 17 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో రెండు బౌండరీలతో 27 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇతనికి తోడుగా రెండో ఓపెనర్‌గా దిగిన సునీల్ నరైన్ క్రీజులో ఉన్నంతసేపూ పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉరుకులు, పరుగులు పెట్టించి బంతులను తుత్తినియలు చేశాడు. 36 బంతులు ఎదుర్కొన్న నరైన్ నాలుగు సిక్సర్లు, తొమ్మిది బౌండరీల సహాయంతో 75 పరుగులు చేశాడు. మంచి ఊపుమీద ఉన్న నరైన్ ఆండ్రూ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 17 బంతులు ఎదుర్కొన్న రాబిన్ ఉతప్ప ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఉతప్ప వెనుతిరిగాడు. ఆండ్రూ రస్సెల్ 14 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, రెండు బౌండరీలతో 31 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చాడు. నితీష్ రాణా నాలుగు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 11 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 23 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. బరీందర్ శ్రాన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. శుభ్‌మాన్ గిల్ ఎనిమిది బంతులు ఎదుర్కొని మూడు ఫోర్‌లతో 16, జవోన్ సీర్లెస్ ఒక బంతి ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఆరు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ టీమ్‌లో ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 41 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ నాలుగు ఓవర్లలో 40 పరుగులు, బరీందర్ శ్రాన్ మూడు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి చెరో వికెట్ సాధించారు.
అనంతరం 246 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 214 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌గా దిగిన విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మయాంక్ అగర్వాల్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో సీయర్లెస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న కరణ్ నాయర్ ప్రసీధ్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలతో 66 పరుగులు చేసి సునీల్ నరైన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అక్షర్ పటేల్ 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో రెండు ఫోర్లతో 19 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సియర్లెస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అరోన్ పింఛ్ 20 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి సియర్లెస్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆండ్రూ టై 10 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఫోర్‌తో 14 పరుగులు చేసి ప్రసీధ్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ 22 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీలతో 45 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. బరీందర్ శ్రాన్ ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు, మోహిత్ శర్మ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ నాలుగు ఓవర్లలో 41 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రసీధ్ కృష్ణ నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 44 పరుగులు, జవోన్ సియర్లెస్ నాలుగు ఓవర్లలో 52 పరుగులు, కుల్దీప్ యాదవ్ రెండు ఓవర్లలో 29 పరుగులిచ్చి తలో వికెట్ సాధించారు.

సంక్షిప్త స్కోరు:
కోల్‌కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 (సునీల్ నరైన్ సి రాహుల్ బి ఆండ్రూ టై 75, దినేష్ కార్తీక్ సి మిల్లర్ బి బరీందర్ 50, ఆండ్రూ రస్సెల్ సి రాహుల్ బి ఆండ్రూ టై 31, క్రిస్ లీన్ బి ఆండ్రూ టై 27, రాబిన్ ఉతప్ప సి మోహిత్ శర్మ బి ఆండ్రూ టై 24, ఆండ్రూ టై 4/41).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 ( లోకేష్ రాహుల్ బి సునీల్ నరైన్ 66, రవిచంద్రన్ అశ్విన్ ఎల్‌బీడబ్ల్యూ ప్రసీధ్ 45, ఆరోన్ పింఛ్ సి కుల్దీప్ యాదవ్ బి సియర్లెస్ 34, క్రిస్ గేల్ సి దినేష్ కార్తీక్ బి ఆండ్రూ రస్సెల్ 21, ఆండ్రూ రస్సెల్ 3/41, ప్రసీధ్ కృష్ణ 2/31).