క్రీడాభూమి

చెన్నై మళ్లీ విన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 13: హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఓపెనర్ గా వచ్చి నాటౌట్‌గా నిలిచి చెన్నైకి అలవోక విజయాన్ని అం దించాడు. సన్‌రైజర్స్ బౌలర్లను ఆటాడుకున్నాడనే చెప్పాలి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో సునాయసంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఓపెనర్లు వాట్సన్, రాయుడుల వీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నైకి విజయాన్ని అందించారు. యువ క్రికెటర్ అంబ టి రాయుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఒపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అంబటిరాయుడు 62 బంతుల్లో ఏడు బౌండరీలు, ఏడు సిక్సర్లతో 100 పరుగులు సాధించి అజేయ సెంచరీ చేసి అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్-11లో 500 పరుగులకు పైగా చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ను ఓడించాడు. ఈ ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
శిఖర్ ధావన్, విలియమ్‌సన్ మరోసారి బ్యాటింగ్‌లో రాణించి అర్ధ సెంచరీలు సాధించడంతో చెన్నై సూపర్ కిం గ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యా టింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 179 పరుగులు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై బౌలర్ల ధాటికి మొదట్లో పరుగులు చేయడానికి తడబడిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ పదో ఓవర్ తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయి పరుగుల వర్షం కురిపించారు. బ్యాటింగ్‌లో మరోసారి రా ణించిన శిఖర్ ధావన్ 49 బంతుల్లో పది బౌండరీలు, రెండు సిక్సర్లతో 79 పరుగులు, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 39 బంతుల్లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటిం గ్ బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చాహార్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని ఆడిన ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఫీల్డర్ రైనా చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ధావన్‌తో కలిసి కెప్టెన్ విలియమ్‌సన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసికట్టుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. ఒక దశలో 10 ఓవర్లలో 62 పరుగులుగా ఉన్న స్కోరు 15 ఓవర్లు ఆట ముగిసే సరికి 130 పరుగులకు చేరుకుంది. ధావన్ సిక్సర్లతో విరుచుకుపడగా, విలియమ్‌సన్ బౌండరీలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ శతక భాగస్వా మ్యం సాధించారు. కానీ బ్రేవో వేసిన 16 ఓవర్ చివరి బంతికి ధావన్ హర్భజన్‌కు క్యాచ్‌ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్‌కు శిఖర్ ధావన్ జట్టు కెప్టెన్‌తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. అనంతరం మరుసటి బంతికి శార్దుల్ ఠాకూర్ వేసిన 17 ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ విలియమసన్ బ్రావో చేతికి చిక్కాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 141 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో దీపక్ హుడా చేలరేగి ఆడటంతో ప్రత్యర్థి జట్టు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. దీపక్ హుడా 11 బంతుల్లో ఒక బౌండరీ, సిక్సర్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాంటింగ్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓవర్ మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చెన్నై జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించడంతో జట్టు స్కోరు వేగం పెరిగింది. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కూడా నష్టపోకుండా వాట్సన్, రాయుడు 128 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. 14వ ఓవర్‌లో షకీబ్ వేసిన మూడో బంతికి వాట్సన్ రనౌట్ అయ్యాడు. వాట్సన్ 35 బంతుల్లో ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 15వ ఓవర్‌లో సందీప్ బౌలింగ్‌కు దిగాడు. ఈ ఓవర్‌లో మొదటి బంతికే సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి రైనా ఔటయ్యాడు. చివరి వరకు పట్టుదలతో ఆడిన రాయుడు శతకం చేసి చెన్నై విజ యంలో ప్రధాన భూమిక పోషించాడు.