క్రీడాభూమి

రాయల్స్ దూకుడుకు ముకుతాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 14: ఐపీఎల్ సీజన్ ముగింపులో దాదాపు ప్లే ఆఫ్ దశకు వివిధ జట్లు చేరుకుంటున్న తరుణంలో ఇపుడిపుడే దూకుడును ప్రదర్శిస్తున్న రాజస్తాన్ రాయల్స్‌కు మంగళవారం తమ స్వంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముకుతాడు వేయగలదా? అని పలువురు క్రీడాభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లలో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉండగా, రాజస్తాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ రెండు టీమ్‌లు ఇంతవరకు 12 మ్యాచ్‌లు ఆడగా ఆరింట్లో విజయం, మరో ఆరింట్లో అపజయాలను చవిచూశాయి. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు సమాన పాయింట్లతో ఉన్నాయి. తొలి నుంచి దాదాపు ఈ రెండు జట్లూ పడుతూ లేస్తూ వస్తున్నాయి. ప్లే ఆఫ్‌లో బెర్త్ కోసం ఇరు జట్లు మంగళవారం హోరాహోరీగా తలపడనున్నాయి.
అయితే, కోల్‌కతా పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆరు వికెట్ల నష్టానికి 245 అత్యధిక పరుగులు సాధించి, ఈ సీజన్‌లోనే ఎక్కువ పరుగుల వరద పారించిన జట్టుగా వినుతికెక్కింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 31 పరుగుల తేడాతో ప్రత్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. అదేవిధంగా రాజస్తాన్ ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీమ్‌లో ఓపెనర్‌గా దిగిన జోస్ బట్లర్ అత్యధికంగా 94 పరుగులు చేసి జట్టును విజయపథాన నిలిపాడు. బట్లర్ వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఐదుసార్లు అర్థ సెంచరీలు (67, 51, 82, 95 (నాటౌట్), 94 (నాటౌట్) సాధించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. బట్లతోపాటు ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌లో ఏ స్థానంలో దిగినా జట్టును ఆదుకుంటున్నాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడితే కోల్‌కతాకు కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్ల ద్వయంలో ఏ ఒక్కరిని పడగొట్టినా కోల్‌కతా కాస్త ఊపిరి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా కోల్‌కతా కెప్టెన్, సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్ బట్లర్, స్టోక్స్‌ల బలహీనతలపై దెబ్బ కొట్టేందుకు స్పిన్‌తో ఎదురుదాడికి దిగితే ఫలితం ఉండొచ్చు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ ఎలిమినేటర్, ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కోల్‌కతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మూడు లేదా నాలుగో స్థానంలో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని యోచిస్తోంది. కోల్‌కతా టీమ్‌లో కెప్టెన్ దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, శుభ్‌మాన్ గిల్ వంటివారు మంచి ఫామ్‌లో ఉన్నారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఇండోర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా క్రికెటర్ సునీల్ నరైన్ 36 బంతులు ఎదుర్కొని 75 పరుగులు, కెప్టెన్ దినేష్ కార్తీక్ 23 బంతులు ఎదుర్కొని అర్థ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో సునీల్ నరైన్, దినేష్ కార్తీక్, రాజస్తాన్‌లో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లపై ఆయా జట్లు ఎక్కువ నమ్మకంతో ఉన్నాయి.