క్రీడాభూమి

కుప్పకూలిన ‘కింగ్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతి తక్కువ స్కోరు నమోదైంది. సోమవారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరుగులు పారించలేక చతికిలబడింది. కేవలం 88 పరుగులకే ఆలౌటై చాపచుట్టేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది రెండో అతి తక్కువ స్కోరు. (ఏప్రిల్ 24 సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన ముంబయి ఇండియన్స్ 18.5 ఓవర్లలో 87 పరుగులు చేసింది. ఇదే అప్పటికి ఈ సీజన్‌లో అతి తక్కువ స్కోరు కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ 118 పరుగులు చేసింది. 31 పరుగులతో సన్‌రైజర్స్ అప్పట్లో విజయం సాధించింది)
*
ఇండోర్, మే 14: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ సిక్సర్లు, బౌండరీలతో మెరిపించి, మురిపించిన పంజాబ్ వికెట్ కీపర్ ఎల్.కే.రాహుల్ పరుగులు తీయలేకపోయాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా అతి తక్కువ పరుగులకే పెవిలియన్ దారిపట్టగా, అరోన్ పింఛ్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. ఫలితంగా ఈ జట్టు 88 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది.
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. వికెట్ కీపర్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఎల్.కే.రాహుల్ 15 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో డి గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుతిరిగాడు. 14 బంతులు ఎదుర్కొన్న క్రిస్ గేల్ నాలుగు ఫోర్లతో 18 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కరణ్ నాయర్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసి సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మార్కస్ స్టోయినిస్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అరోన్ పింఛ్ 23 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో 26 పరుగులు చేసి మొరుూన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఒక బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ఆండ్రూ టై మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మోహిత్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అంకిత్ రాజ్‌పుఠ్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అక్షర పటేల్ 13 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
బెంగళూరు బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ మూడు ఓవర్లలో 17, యుజ్వేంద్ర చాహల్ రెండు ఓవర్లలో 6, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రెండు ఓవర్లలో 8, మొరుూన్ అలీ 2.1 ఓవర్లలో 13 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన స్వల్ప లక్ష్యం (89) బెంగళూరు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. కేవలం 8.1 ఓవర్లలోనే 92 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 28 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 48 పరుగులు, పార్థివ్ పటేల్ 22 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.
సంక్షిప్త స్కోరు:
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 15.1 ఓవర్లలో 88 ఆలౌట్ (అరోన్ పించ్ సి విరాట్ కోహ్లీ బి మొయిన్ 26, ఎల్.కే.రాహుల్ సి గ్రాండ్‌హోమ్ బి ఉమేష్ యాదవ్ 21, క్రిస్ గేల్ సి సిరాజ్ బి ఉమేష్ యాదవ్ 18, ఉమేష్ యాదవ్ 23/3).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 8.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 (విరాట్ కోహ్లీ 48 నాటౌట్, పార్థివ్ పటేల్ 40 నాటౌట్).

చిత్రం..పంజాబ్‌పై గెలుపుతో ఆనందం పంచుకుంటున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కీపర్ పార్థివ్ పటేల్