క్రీడాభూమి

ఇరు జట్లకూ ప్రతిష్టాత్మకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 15: వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఇటు ముంబయి ఇండియన్స్, అటు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. మొత్తం ఐపీఎల్ జట్లలో ఆరో స్థానంలో ఉన్న ముంబయి ఇంతవరకు 12 మ్యాచ్‌లు ఆడగా, ఐదింట్లో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో అపజయం పాలై పాయింట్ల పట్టికలో 10 పాయింట్లు సాధించింది. ఇక ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ ఇంతవరకు 12 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఆరు మ్యాచ్‌లలో గెలుపు, మరో ఆరు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు 12 పాయింట్లు సాధించింది. బుధవారం జరిగే మ్యాచ్ ఇటు ముంబయి, అటు పంజాబ్‌కు చావోరేవో తేల్చేలా ఉంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి దాదాపు ప్లే ఆఫ్ దశకు చేరడం కష్టమే. ఈ టీమ్ ఆడబోయే మిగిలిన మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతోపాటు అత్యధిక రన్ రేటు సాధిస్తే అవకాశాలు కొంత మెరుగుపడవచ్చునని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. గత మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు సాధించడంలో విఫలం కావడం, కేవలం సూర్యకుమార్ యాదవ్, మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ వంటివారిపై పరుగుల భారం పడుతోంది. ఈ దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో కెప్టెన్ సహా మిగిలిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వరద సృష్టిస్తే కొంతవరకైనా మేలు జరుగుతుంది. అదేవిధంగా బౌలింగ్ సామర్థ్యం కూడా ముంబయిని వేధిస్తున్న మరో సమస్య. పాండ్య సోదరులతోపాటు, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, ఎడమచేతివాటం పేసర్ మిచెల్ క్లీన్‌గన్ వంటివారు తెలివిగా బౌలింగ్ చేస్తేనే పంజాబ్ టీమ్‌లోని ఓపెనర్లు కే.ఎల్.రాహుల్, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పరుగుల వరదకు బ్రేక్ పడుతుంది. ఇక కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని పంజాబ్ సోమవారం ఇండోర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 88 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబయి తర్వాత (మొత్తం పరుగులు 87) రెండో అత్యల్ప స్కోరు చేసింది. పంజాబ్ ఓపెనర్లు, గత మ్యాచ్‌లలో పరుగుల వరద సృష్టించిన రాహుల్, గేల్ ఆటలు సైతం ప్రత్యర్థి బౌలింగ్ ముందు పనిచేయలేదు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ అన్ని విభాగాల్లోనూ ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ ముంబయి జట్టుకు పంజాబ్ తీసిపోని విధంగా తయారైంది. కేవలం ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌లపై పూర్తిగా ఆధారపడి, గెలిపించే బాధ్యతను వారి నెత్తిన రుద్దడంతో ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఈ టీమ్‌లో గాయపడిన ఆఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్‌ఖ ముజీబ్ ఉర్ రహ్మాన్ బుధవారంనాటి మ్యాచ్‌లో ఆడే అవకాశం లేకుంటే కెప్టెన్ అశ్విన్, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా తమ తదుపరి మ్యాచ్‌లలో ఆడతామని, బౌలింగ్‌కు ప్రత్యర్థిని కట్టడి చేయడంతోపాటు ఇటు ఎంతో అనుభవం కలిగిన అంతర్జాతీయ స్థాయి బ్యాట్స్‌మెన్‌లు తమ జట్టులో ఉండడం వల్ల వారినుంచి మంచి ఫలితాలు రాబట్టగలమని పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.