క్రీడాభూమి

ఇటాలియన్ ఓపెన్ మారథాన్ మ్యాచ్‌లో షరపోవా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 16: ఇక్కడ జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యాబ్యూటీ మరియా షరపోవా రెండో రౌండ్ చేరడానికి మారథాన్ మ్యాచ్‌ని ఆడాల్సి వచ్చింది. చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీని ఆమె 7-5, 3-6, 6-2 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరింది. మరింత ముందంజ వేయడానికి ఆమె రెండో రౌండ్‌లో డొమినికా సిబుల్కొవాను ఢీ కొంటుంది. అంతకు ముందు మొదటి రౌండ్ మ్యాచ్‌లో సిబుల్కొవా 6-1, 6-7, 6-2 ఆధిక్యంతో ఫ్రాన్సిస్కా షియవోన్‌పై విజయం సాధించింది. ఇలావుంటే, రెండో రౌండ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఎలినా స్విటోలినా సునాయాసంగా తన ప్రత్యర్థిని ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న పెట్రా మార్టిక్‌ను ఆమె 6-1, 6-2 తేడాతో చిత్తుచేసింది.