క్రీడాభూమి

క్రికెట్ పరిరక్షణే తక్షణ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పలు రకాలుగా చుట్టుముడుతున్న సమస్యల నుంచి క్రికెట్‌ను పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలోని స్ట్రాటజిక్ వర్కింగ్ గ్రూప్ (ఎస్‌డబ్ల్యూజీ) గురువారం సమావేశం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధికారులతో కూడా ఈ బృందం చర్చిస్తుంది. ఇటీవల కాలంలో టీ-10 ఫార్మాట్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రతిపాదన ఐసీసీని ఆందోళనకు గురిచేస్తున్నది. మరోవైపు, కొంత మంది క్రికెట్ అధికారులు, భారీ పెట్టుబడిదారులు ఒకటిగా కలిసి ఐసీసీకి పోటీగా మరో సంస్థను ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఎస్‌డబ్ల్యూజీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అన్ని వైపుల నుంచి దూసుకొస్తున్న సమస్యలను విశే్లషించి, పరిష్కార మారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతినిధి డేవిడ్ పీవెర్, బిసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రి, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాజా, క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్‌ఏ) ప్రతినిధి పాట్రిక్ కరాంబమీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చెందిన డేవ్ కామెరాన్, మహిళా ప్రతినిధి క్లేర్ కానర్ సభ్యులుగా ఉన్న ఎస్‌డబ్ల్యుజీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పాడు. బీసీసీఐ తాత్కాలిక పాలక మండలిలోని అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీ, కోశాధికారి అనిరుద్థ్ చౌదరీతో సమావేశమై, వివరాలు అందిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నాడు. అందుకే, బీసీసీఐతో చర్చించి, ఒక నిర్ణయానికి రావడం సమంజసంగా ఉంటుందన్నాడు. క్రికెట్‌లో తలపండిన ఒక వ్యాపారి, భారత్‌కు చెందిన ఒక టీవీ చానెల్ అధినేత, ఆస్ట్రేలియాలోని ఒక న్యాయవాది ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులున్న పలువురు క్రికెటర్లను కలిసి, భారీ మొత్తాలను ఇచ్చి, టీ-10 ఫార్మాట్‌లో ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సిందిగా ప్రతిపాదిస్తున్నట్టు ఆ అధికారి తెలిపాడు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఒక టోర్నీలో ఇయాన్ మోర్గాన్, షోయబ్ మాలిక్, డ్వెయిన్ బ్రేవో తదితరులు పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశాడు. వారి ప్రయత్నాలు ఫలిస్తే, ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ క్రికెట్ సంస్థ తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని, అందుకే, సమస్య తీవ్రతను గుర్తించి, అన్ని కోణాల్లోనూ విశే్లషించి, పరిష్కార మార్గాలను అనే్వషిస్తామని వివరించాడు.
ఇలావుంటే, క్రికెట్‌తో సంబంధం ఉన్న వ్యాపారి పేరును ఎస్‌డబ్ల్యూజీ అధికారి ప్రస్తావించకపోయినప్పటికీ, ఐపీఎల్‌కు బీజం వేసిన లలిత్ మోడీ పూనుకొని టీ-10 ఫార్మాట్‌లో క్రికెట్ టోర్నీని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసం వారు కొత్తకొత్త ప్రతిపాదనలతో ముందుకొస్తూ, క్రికెటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 2016లో ఐసీసీకి పోటీ సంస్థను ఏర్పాటు చేయడానికి లలిత్ మోడీ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ప్రతిపాదనకు ఆదిలోనే తెరపడింది. కానీ, ఇప్పుడు టీ-10 వంటి కొత్త తరహా టోర్నీ పేరుతో అతను మళ్లీ తెరపైకి రావడం సహజంగానే ఐసీసీని ఆందోళనకు గురి చేస్తున్నది. అందుకే, ప్రత్యామ్నాయ క్రికెట్ సంస్థగానీ, టీ-10 టోర్నమెంట్‌గానీ రాకుండా అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌డబ్ల్యూజీ చర్చించనుంది.