క్రీడాభూమి

ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ సెమీస్‌కు స్విటోలినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 18: ఉక్రెయిన్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా ఇక్కడ జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె తన ప్రత్యర్థి, 12వ ర్యాంకర్ ఏంజెలిక్ కెర్బర్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించింది. రెండు సెట్లలోనూ విజయం కోసం కెర్బర్ ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
నాదల్, సిలిక్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో రాఫెల్ నాదల్, మారిన్ సిలిక్ సెమీ ఫైనల్స్ చేరారు. ఫాబియో ఫోగ్నినీతో జరిగిన మ్యాచ్ తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన నాదల్ ఆతర్వాత ఎదురుదాడికి దిగి, 6-1, 6-2 ఆధిక్యంతో విజయం సాధించి ముందంజ వేశాడు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిలిక్ 6-3, 6-3 స్కోరుతో, వరుస సెట్లలో పాబ్లో కారెలో బస్టాపై గెలుపొందాడు.

చిత్రం..ఎలినా స్విటోలినా