క్రీడాభూమి

గ్రూప్ దశలో ‘టాప్-10’ వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్యాటింగ్ విభాగంలో రిషభ్ పంత్, బౌలింగ్ విభాగంలో ఆండ్రూ టై నంబర్ వన్ స్థానాల్లో ఉన్నారు. మంగళవారం మొదటి క్వాలిఫయర్‌లో ఢీ కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆటగాళ్లలో కేన్ విలియమ్‌సన్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, షేన్ వాట్సన్ బ్యాటింగ్ ‘టాప్-10’లో, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్ బౌలింగ్ ‘టాప్-10’లో స్థానం సంపాదించారు.
బ్యాటింగ్‌లో..
1. రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), 14 ఇన్నింగ్స్‌లో 684 పరుగులు, 2. కేన్ విలియమ్‌సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), 14 ఇన్నింగ్స్‌లో 661 పరుగులు, 3. లోకేష్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), 14 ఇన్నింగ్స్‌లో 659 పరుగులు, 4. అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్), 14 ఇన్నిగ్స్‌లో 586 పరుగులు, 5. జొస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), 13 ఇన్నింగ్స్‌లో 548 పరుగులు, 6. విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), 14 ఇన్నింగ్స్‌లో 530 పరుగులు, 7. సూర్యకుమార్ యాదవ్ (ముంబయి ఇండియన్స్), 14 ఇన్నింగ్స్‌లో 512 పరుగులు, 8. ఏబీ డివిలియర్స్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), 11 ఇన్నింగ్స్‌లో 480 పరుగులు, 9. మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్), 14 ఇన్నింగ్స్‌లో 446 పరుగులు, 10. షేన్ వాట్సన్ (చెన్నై సూపర్ కింగ్స్), 13 ఇన్నింగ్స్‌లో 438 పరుగులు.
బౌలింగ్‌లో..
1. ఆండ్రూ టై (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు, 2. ఉమేష్ యాదవ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, 3. ట్రెంట్ బౌల్ట్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు, 4. హార్దిక్ పాండ్య (ముంబయి ఇండియన్స్), 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు, 5. జస్‌ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్), 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు, 6. సిద్ధార్థ్ కౌల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు, 7. రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు, 8. సునీల్ నారైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు, 9. మాయాంక్ మార్కండే (ముంబయి ఇండియన్స్), 14 ఇన్నింగ్స్‌లో 15 వికెట్లు, 10. ముజీబ్ ఉర్ రహ్మాన్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు.