క్రీడాభూమి

‘రాయల్స్’పై ‘రైడర్స్’ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 25 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది.
ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా తలపడ్డాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 169 పరుగులు చేయగా, రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టు ఈనెల 25న జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.
తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సునీల్ నరైన్ రూపంలో కోల్‌కతా తొలి వికెట్‌ను చేజార్చుకుంది. నరైన్ రెండు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేసి కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్లాసెన్ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. రాబిన్ ఉతప్ప ఏడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు.
నితీష్ రాణా ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి జోఫ్రా ఆర్చెర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ లీన్ 22 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 18 పరుగులు చేసి శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శుభ్‌మాన్ గిల్ 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీలతో 28 పరుగులు చేసి జోఫ్రా ఆర్చెర్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 38 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో 52 పరుగులు చేశాడు. లాఫ్‌లిన్ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చిన దినేష్ కార్తీక్ తిరుగుముఖం పట్టాడు. జవోన్ సియర్లెస్ ఐదు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి లాఫ్‌లిన్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చెర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆండ్రూ రస్సెల్ 25 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, మూడు బౌండరీల సహాయంతో 49, పీయూష్ చావ్లా పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు.
రాజస్థాన్ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్ మూడు ఓవర్లలో 15, జోఫ్రా ఆర్చెర్ నాలుగు ఓవర్లలో 33, బెన్ లాఫ్‌లిన్ మూడు ఓవర్లలో 35 పరుగులిచ్చి తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. శ్రేయాస్ గోపాల్ నాలుగు ఓవర్లలో 34 పరులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 13 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 41 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. 38 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ రెండు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో అర్ధ సెంచరీ నమోదు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో సియర్లెస్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్టువర్ట్ బిన్నీ మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ప్రసీధ్ బౌలింగ్‌లో క్రిస్ లీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 18 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 18, కృష్ణప్ప గౌతమ్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో పీయూష్ చావ్లా నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు, ప్రసీధ్ కృష్ణ నాలుగు ఓవర్లలో 28 పరుగులు, కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.