క్రీడాభూమి

కోహ్లీకి గాయం.. కౌంటీకి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: మెడకు తగిలిన గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌లో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈనెల 17న బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన సమయంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత జూన్ 15న జరిగే ఫిట్‌నెస్ పరీక్షల తర్వాత పూర్తిగా కోలుకుంటే జూన్ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కోహ్లీ ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపాడు. వాస్తవానికి కోహ్లీ జూన్‌లో సుర్రే సిసిసి తరఫున ఆడాల్సి ఉందని, అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మూడువారాల పాటు అతనికి పూర్తి విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. జూన్ 14 నుంచి బెంగళూరులో అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశం ఏకోశానా లేదు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఇంగ్లాండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో కోహ్లీ ఆడతాడు.