క్రీడాభూమి

మళ్లీ క్రికెట్‌లోకి స్టీవ్ స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, మే 25: దక్షిణాఫ్రికాలోకి కేప్ టౌన్‌లో ఆతిధ్య జట్టుతో గత మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పాత్ర ఉన్నట్టు రుజువు కావడంతో ఏడాది కాలం పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మళ్లీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న కెనడా గ్లోబల్ టీ-20 లీగ్ మ్యాచ్‌లో అతను ‘మాక్వీ’ ఆటగాళ్లతో కలసి ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టార్ ఆటగాళ్లు విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, షాహీద్ ఆఫ్రిది, డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ, క్రిస్ లీన్, డారెన్ సామీ, డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటివారు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన బాల్‌ట్యాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఏడాదిపాటు, మరో క్రికెటర్ కామరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం కారణంగా ఆస్ట్రేలియాలో ఏడాదిపాటు ఎలాంటి మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం లేకపోయినా 28 ఏళ్ల స్టీవ్ స్మిత్ టీ-20 లీగ్ మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించనున్న విషయాన్ని కెనడా క్రికెట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా బయట జరిగే దేశవాళీ టోర్నమెంట్‌లలో స్టీవ్ స్మిత్ ఆడే అవకాశం ఉండడంతో తమ టీ-20 లీగ్ మ్యాచ్‌లోకి ఆడేందుకు అతని పేరును ప్రతిపాదించినట్టు కెనడా క్రికెట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ఏడాది భారత్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన స్టీవ్ స్మిత్‌పై దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో జరిగిన బాల్‌ట్యాంపరింగ్ వివాదం చుట్టుముట్టడంతో అతనిని రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి తొలగిస్తూ బీసీసీఐ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో కూడా స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించడంతోపాటు రెండేళ్లపాటు స్వదేశంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి వీలులేకుండా ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28 నుంచి జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో ఐదు కెనడా టీమ్‌లు, ఒకటి వెస్టిండీస్ టీమ్. ఈ ఆరు టీమ్‌లకు కరేబియన్ ఆల్‌స్టార్స్, టొరంటో నేషనల్స్, మాంట్రియల్ టైగర్స్, ఒట్టావా రాయల్స్, వాంకోవర్ నైట్స్, విన్‌పెగ్ హాక్స్ అని పేర్లు పెట్టారు. ఇదిలావుండగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ డేవ్ కామరాన్ మాట్లాడుతూ గ్లోబల్ టీ-20 కెనడా మ్యాచ్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించాడు. ఇలాంటి లీగ్ మ్యాచ్‌లు, టోర్నమెంట్ల ద్వారా ఎంతోమంది క్రికెటర్లు వెలుగులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ మ్యాచ్ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన కెనడా క్రికెట్ నిర్వాహకులకు భరోసా ఇచ్చాడు. కాగా, కెనడా టొరంటోలోని మాపుల్ లీఫ్ క్రికెట్ క్లబ్‌లో నిర్వహించే ఈ లీగ్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్‌లతోపాటు జూలై 16న చాంపియన్‌షిప్ కూడా ఉంటుందని కెనడా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ రంజిత్ సైనీ పేర్కొన్నాడు. ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ లీగ్ మ్యాచ్ కెనడావాసులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డాడు.