క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌కు జంబో టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇండోనేషియాలో ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించనున్న ఆసియా గేమ్స్‌కు భారత్ తరఫున అతిపెద్ద జంబో టీమ్ ప్రాతినిధ్యం వహించనుంది. ప్రాథమికంగా ఎంపికైన 2370 మంది జాబితాలో 900 మందితో కూడిన బృందం ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా పేర్కొన్నారు.
ఈ బృందంలో తుదిజాబితాలో 620 మందికి పైగా అథ్లెట్లు, దాదాపు 273 మంది అధికారులు ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. తొలుత తమకు అందిన ప్రాథమిక జాబితాలో 1938 అథ్లెట్లు, సహాయ సిబ్బందితో కలసి 399 మంది అధికారులు, ఎనిమిది మంది ఐఓఏ అధికారులు, ఏడుగురు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు, 18 మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) అధికారులు కలసి మొత్తం 2370 మంది ఉన్నారని తెలిపారు. అయితే, క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించిన తర్వాత జూన్ 30వ తేదీ వరకు ఈ జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత 900 మందితో కూడిన బృందం తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ అంచనా ప్రకారం తుది జాబితాలో 620 మందికి పైగా అథ్లెట్లు, 273 మంది అధికారులు ఉండొచ్చునని తెలిపారు. 2014లో దక్షిణ కొరియా ఇన్‌చియోన్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌కు భారత్ నుంచి 541 మంది అథ్లెట్లను పంపించగా 28 అంశాల్లో 57 పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఈసారి ఇండోనేషియా ఆసియా గేమ్స్‌కు మాత్రం అతి పెద్ద జంబో బృందాన్ని పంపించేందుకే క్రీడల మంత్రిత్వ శాఖ మొగ్గు చూపుతోందని, ఇందుకు అథ్లెట్ల ఎంపిక బాధ్యతను మాత్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు అప్పగించిందని పేర్కొన్నారు. ఇంకా గుర్తింపునకు నోచుకోని లేదా తాత్కాలికంగా వాయిదా వేసిన తైక్వాండో, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ వంటి నాలుగు అథ్లెటిక్ అంశాలో టీమ్‌ల ఎంపికను అడ్‌హాక్ కమిటీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) ఈనెల 6వ తేదీన సమావేశమవుతుందని, ఇందులో ఐఓఏ పరిశీలకుడు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నందున, అంతా సవ్యంగా ఉంటే సంబంధిత బృందాన్ని ఆసియా గేమ్స్‌కు పంపించే వీలుంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, గత కొనే్నళ్లుగా ఫుట్‌బాల్ విభాగంలో భారత్ బాగా పరిణితి సాధించిందని, ‘్ఫఫా’ ప్రపంచ కప్‌లో సైతం భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకుందని, తద్వారా ఆసియా చాంపియన్‌షిప్ (ఆసియా కప్)కు క్వాలిఫై అయిందని తెలిపారు. ముంబయిలో 2026లో నిర్వహించే యూత్ ఒలింపిక్ గేమ్స్‌తోపాటు 2030లో న్యూఢిల్లీలో నిర్వహించే ఆసియా గేమ్స్, 2032లో న్యూఢిల్లీలో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారుల గురించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఐఓసీ కాంగ్రెస్ మీటింగ్‌ను 2021 లేదా ఆ తర్వాత నిర్వహించేందుకు వీలుగా తన సంసిద్ధతను ఐఓఏ తెలియజేసింది. ఈ సమావేశంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన ప్రగతిని ఐఓఏ సభ్యులు సమీక్షించారని తెలిపాడు.

చిత్రం..న్యూఢిల్లీలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్ష డు నరీందర్ బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా