క్రీడాభూమి

సైనా, సింధుల రూటే సెపరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూఢిల్లీ, జూన్ 5: అంతర్జాతీయ బాడ్మింటన్‌లో రాణిస్తూ మేటి స్టార్లుగా ఎదుగుతున్న సైనా నెహ్వాల్, పీవీ సింధుల రూటే సెపరేటు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన సైనా, సింధులకు జాతీయ కోచ్ గోపిచంద్ వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం చర్చానీయంశంగా మారింది. కామనె్వల్త్ క్రీడలో పతకాలు సాధించి తిరిగి వచ్చిన సైనా నెహ్వాల్, సింధులకు గోపీచంద్ రెండు అకాడమీల్లో శిక్షణనిస్తున్నాడు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో సైనా గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీకి తిరిగి వచ్చింది. కామనె్వల్త్ క్రీడల్లో సైనా బంగారు పతకం సాధించిన తర్వాత సైనా, సింధులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని తన కోచ్‌ల బృందం నిర్ణయించిందని పుల్లెల గోపీచంద్ తెలిపాడు. 2014లో సెప్టెంబర్‌లో సైనా గోపీచంద్ అకాడమీని విడిచి బెంగళూరులోని విమల్ కుమార్ వద్ద శిక్షణ పొంది ప్రపంచ నెంబర్ వన్‌గా ఎదిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. అకాడమీలో సైనా, సింధూతో పాటు ఇతర క్రీడాకారిణులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇద్దరి శిక్షణ కోసం సమయం కేటాయిస్తున్నట్లు తెలిపాడు. గోపీచంద్ అకాడమీకి ఆర కిలోమీటర్ దూరంలో రెండో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అందులో సింగిల్స్ విభాగంలో క్రీడాకారిణులకు శిక్షణనిస్తున్నట్లు వివరించాడు. గతంలో వేర్వేరు షెడ్యూళ్లలో సైనా, సింధులకు శిక్షణ ఇచ్చామని, క్రీడాకారిణుల ఆఅసక్తి మేరకు కోచింగ్ జట్టు నిర్ణయంతో వారికి వేర్వేరు అకాడమీల్లో శిక్షణనిస్తున్నట్లు స్పష్టం చేశాడు.