క్రీడాభూమి

కలిసొచ్చిన ‘ఐపీఎల్’ -- ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 5: భారత్‌లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం కలిసొచ్చిందని, తనలో ఆత్మ విశ్వాసం రెట్టింపు చేసిందని ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్ స్పష్టం చేశాడు. బట్లర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ 11వ సీజన్‌లో బ్యాటింగ్‌లో రాణించి ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో రాణించినందుకు గాను బట్లర్‌ను పాకిస్తాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ల కోసం ఎంపికచేసిన ఇంగ్లాండ్ జట్టులో ఆవకాశం కల్పించింది ఇంగ్లాంట్ క్రికెట్ బోర్డు. ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ ఐపీల్ క్రికెట్ లీగ్‌లో ఆడిన తనకు ఈ సీజన్ తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిందన్నాడు. కొన్ని వారాల పాటు భారత్‌లో గడిపిన తాను కొన్ని మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురైనప్పటికీ బ్యాటింగ్‌లో రాణించగలిగానన్నాడు. ఐపీఎల్‌లో తన ప్రదర్శనను చూసి ఇంగ్లాండ్ టెస్టు జట్టులో చాలాకాలం తర్వాత చోటు దక్కిందని చెబుతూ టీ-20, టెస్టు మ్యాచ్‌లకు పూర్తి వ్యత్యాసం ఉంటుందన్నాడు. టీ-20లో జరిగే మ్యాచ్‌లో ఒక మ్యాచ్‌లో రాణించకున్నా మరో మ్యాచ్‌లో ఆడేందుకు ఆవకాశం వుంటుంది. కానీ, టెస్టు మ్యాచ్‌లో ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పాడు. టెస్టు మ్యాచ్‌లో ముందే ఔటైతే దాని గురించి ఐదు రోజుల పాటు లోచించాల్సి వస్తుందని బట్లర్ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్ తీరును ప్రదర్శించి 80 పరుగులు చేయడంతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. చాలా కాలం తర్వాత టెస్టు జట్టుకు ఆడటం తనలో సంతోషాన్ని నింపిందన్నాడు.