క్రీడాభూమి

అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్‌గా కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పోలీ ఉమీగ్రర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అదేవిధంగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా ఈ గౌరవ పురస్కారాలకు అర్హత సాధించారు. 2016-17, 2017-18 సంవత్సరాలకుగాను ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్‌గా ఎంపికైన కోహ్లీ మంగళవారం బెంగళూరులో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించనున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా ఇదే సంవత్సరాలకు ఈ అవార్డులకు ఎంపికైనట్టు బీసీసీఐ పేర్కొంది. కాగా, క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించిన వారికి దివంగత జగన్మోహన్ దాల్మియా జ్ఞాపకార్థం నలుగురికి అవార్డులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. జగన్మోహన్ దాల్మియా ట్రోఫీని అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేయడంతోపాటు అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌క, మహిళా క్రికెట్‌లో జూనియర్, సీనియర్ టీమ్‌లలో ఉత్తములుగా రాణించినవారికి ఈ అవార్డులు అందజేయనున్నారు. కాగా, తొమ్మిది విభాగాల్లో ఇంతవరకు ఇస్తున్న లక్ష రూపాయల పారితోషికాన్ని ఇక ముందు లక్షన్నర రూపాయలకు పెంచినట్టు బీసీసీఐ తెలిపింది. ఇదిలావుండగా, బీసీసీఐ అవార్డులు అందుకోబోతున్న అవార్డు గ్రహీతలకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ (సీఓఏ) వినోద్ రాయ్ అభినందించాడు. గత రెండేళ్లుగా భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఎన్నో ఘనవిజయాలను నమోదు చేసుకున్నాయని, వారికి సముచిత రీతిన తగినవిధంగా గుర్తించాలనే ఉద్దేశ్యంతో ఈ అవార్డులకు బీసీసీఐ ఎంపిక చేసిందని పేర్కొన్నాడు.