క్రీడాభూమి

భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జూన్ 7: మహిళల టీ-20 ఆసియా కప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ అంతకుముందు థాయిలాండ్, మలేషియాతో జరిగిన వరుస మ్యాచ్‌లలో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసినా నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపుతో శనివారం తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌లో చోటు కోసం భారత్ తలపడుతుంది. గురువారం నాటి మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేయగా, అందుకు ప్రతిగా భారత్ 18.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. శ్రీలంక టీమ్‌లో హాసిని పెరెరా 43 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. యశోద మెండిస్ 39 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 27 పరుగులు చేసింది. మిగిలిన క్రికెటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేక చతికిలపడ్డారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుంది. జులన్ గోస్వామి, అనుజా పాటిల్, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 108 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ అతి సునాయాసంగా ఛేదించింది. స్మృతి మంధాన 16 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 12 పరుగులు, మిథాలీ రాజ్ 33 బంతుల్లో ఒక బౌండరీతో 23 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 25 బంతుల్లో రెండు ఫోర్లతో 24 పరుగులు చేశారు.
వేదా కృష్ణమూర్తి 23 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 29, అనుజా పాటిల్ 16 బంతులు ఎదుర్కొని 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో యుదేషికా ప్రబోధని, ఓషాది రణసింఘే, నీలాక్షి డిసిల్వా తలో వికెట్ తీసుకున్నారు. కాగా, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూడు జట్లు నాలుగు గేమ్స్‌లో ఆడడం ద్వారా ఆరేసి పాయింట్లు సాధించాయి. కానీ ఈ మూడు జట్లలో భారత్ నెట్ రన్ రేటు +2.709 ఎక్కువగా ఉంది. ఫైనల్‌లో చోటు కోసం శనివారం జరిగే భారత్ జట్టు పాకిస్తాన్‌లో తలపడనుండగా, బంగ్లాదేశ్ మలేషియాతో పోటీపడుతుంది.

సాకర్ వరల్డ్ కప్ ట్రివియా
తాత.. మనుమడు..
సాకర్ వరల్డ్‌కప్‌లో ఆడిన ఎక్కువ వయసుగల క్రీడాకారుడు రోజర్ మిల్లా. 1994లో రష్యాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగే సమయానికి అతని వయసు 42 సంవత్సరాల 39 రోజులు. ఇక అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు ఐర్లాండ్ ఆటగాడు నార్మన్ వైట్‌సైడ్. 1982 ప్రపంచకప్‌లో యుగస్లోవియాపై మ్యాచ్ ఆడినప్పుడు అతని వయసు 17 సంవత్సరాల 41 రోజులు.
ఫలితం లేని విజయాలు..
స్కాట్‌లాండ్ 1974లో (ఒక విజయం, రెండు డ్రాలు), బ్రెజిల్ 1978లో (నాలుగు విజయాలు, 3 డ్రాలు), ఇంగ్లాండ్ 1982లో (3 విజయాలు, రెండు డ్రాలు), కామెరూన్ 1982లో (మూడు డ్రాలు), బెల్జియం 1998లో (మూడు డ్రాలు) ఒకే రకమైన రికార్డులో భాగస్వాములయ్యాయి. ఈ ఆయా ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో ఈ జట్లు ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోలేదు. అయితే, దురదృష్టవశాత్తు సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించాయి. అపజయం అంటే తెలియకుండా ముందుకు దూసుకెళ్లినా, కప్‌ను గెల్చుకోలేకపోయాయి. వాట్ ఎ పిటీ!
‘క్యూస్టర్స్ చివరి మజిలీ’
ఇంగ్లీషులో ‘క్యూస్టర్స్ చివరి మజిలీ’ అన్న వ్యాఖ్య ప్రచారంలో ఉంది. బెల్జియం గోల్‌కీపర్ థియో క్యూస్టర్స్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. 1982 వరల్డ్‌కప్‌లో రెగ్యులర్ గోల్‌కీపర్ జీన్-మరీ ఫాఫ్ గాయంతో మూడో మ్యాచ్ తర్వాత వైదొలగాల్సి వచ్చింది. దీనితో పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యూస్టర్స్‌కు అవకాశం లభించింది. కానీ, ఆ మ్యాచ్‌లో బెల్జియం ఏకంగా 0-3 తేడాతో ఓడింది. క్యూస్టర్స్‌కు ఆతర్వాత జట్టులో మళ్లీ స్థానం దక్కలేదు. అందుకే, క్యూస్టర్స్ చివరి మజిలీ అన్న నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. మ్యాచ్‌లో ఓడినా, చరిత్రలో అతను సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
వీరాభిమానులు..
బ్రెజిల్‌లో సాకర్‌ను ఆరాధించే వీరాభిమానులు ఎక్కువ. 1950 ప్రపంచకప్ సాకర్ ఫైనల్‌కు రియో డిజెనెరియోలోని మరకానా స్టేడియం ఆతిథ్యమిచ్చింది. టైటిల్ కోసం ఉరుగ్వేతో బ్రెజిల్ పోటీపడే సందర్భాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఉద్దేశంతో హాజరైన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. 1,99,854 మంది ఆ మ్యాచ్‌ని తిలకించారు. బ్రెజిల్ విజయాన్ని కళ్లారా చూసి కేరింతలు కొట్టారు. ప్రపంచకప్ సాకర్ చరిత్రలోనే ఇప్పటివరకు ఒక మ్యాచ్‌కి హాజరైన అత్యధిక సంఖ్య అదే. ఇప్పటి రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.