క్రీడాభూమి

ఐసీసీ టీ-20 ర్యాకింగ్స్‌లో రషీద్ స్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూన్ 8: డెహ్రాడూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సీరిస్‌లో 12 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించిన అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐసీసీ ప్రకటించిన టీ-20 క్రికెటర్‌ల ర్యాంకింగ్స్ బౌలింగ్ జాబితాలో తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గానిస్తాన్ క్లీన్ స్వీప్ చెసిన సంగతి తెలిసిందే. చివరి టీ-20లో అఫ్గాన్ ఒక పరుగు తేడాతో గెలుపొంది సీరిస్‌ను సొంతం చేసుకుంది. అఫ్గాన్ జట్టు విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన రషీద్ తన మణికట్టు బౌలింగ్‌తో మొత్తం ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సీరిస్ అవార్డును అందుకున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో కూడా రషీద్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచి పలువురి ప్రసంశలు అందుకున్నాడు. 19 ఏళ్ల అద్భుత స్పిన్నర్ రషీద్ మొత్తం 813 పాయింట్లు సాధించి ఆగ్ర స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌కు చెందిన షాదాబ్ ఖాన్ 759, భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహాల్ 706 పాయింట్లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్‌లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబార్ ఆజామ్ 881 పాయింట్లు సాధించి ఆగ్రస్థానాన్ని ఆక్రమించగా, న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మున్రో 801, ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్ మాక్స్‌వెల్ 799 పాయింట్లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 670 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడాల్సివచ్చింది. ఆల్‌రౌండర్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్ మాక్స్‌వెల్ 390 పాయింట్లతో, అఫ్గానిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ 292, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ ఆల్ హసన్ 288 పాయింట్లతో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. ఇలావుంటే టీం ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.