క్రీడాభూమి

అందరికీ సాదర స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 9: రష్యా అధక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌కు వచ్చే 32 జట్ల ఆటగాళ్లు, అధికారులతోపాటు, లక్షలాది మంది అభిమానులకు సాదర స్వాగతం పలికాడు. ‘ప్రతి ఒక్కరూ తమతమ స్వదేశాల్లో ఉన్నట్టుగానే రష్యాలో సంతోషంగా ఉంవచ్చు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు, వరల్డ్ కప్‌లో ఆడుతున్న జట్లకు హృదయపూర్వక స్వాగతం. ఫుట్‌బాల్ కుటుంబం మొత్తం రష్యాలో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇది మాకు దక్కిన అరుదైన గౌరవం. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు అతిథి సత్కారం తీరు కూడా ప్రతి ఒక్కరినీ ఎంతో అలరిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. రష్యాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తులతో స్వదేశాలకు వెళతారు’ అన్నాడు. ఇలావుంటే, సుమారు పది లక్షల మంది సాకర్ అభిమానులు రష్యాలో జరిగే వరల్డ్ కప్ టోర్నీకి హాజరవుతారని అంచనా. అంతమందికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని పుతిన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, అభిమానులకు తిప్పలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.