క్రీడాభూమి
అందమైన మస్కట్..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాస్కో సహా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అన్ని నగరాల్లోనూ అందమైన మస్కట్ ‘జబివకా’ అలరిస్తున్నది. రష్యా భాషలో ‘జబివకా’ అంటే స్కోరు చేసే వ్యక్తి. ఎంతో కసరత్తు జరిపిన తర్వాత, ఓటింగ్ ద్వారా ఫుట్‌బాల్ ఆడుతున్న తోడేలు రూపాన్ని మస్కట్‌గా ఎంపిక చేశారు. మస్కట్‌గా ఏది ఉండాలో నిర్ధారించడానికి తోడేలు, పులి, పిల్లి మధ్య ఓటింగ్‌కు నోటిఫికేషన్‌ను అధికారులు జారీ చేశారు. ఇంటర్నెట్ ద్వారా నిర్వహించిన ఈ ఓటింగ్‌లో సుమారు పది లక్షల మంది పాల్గొన్నారు. ‘జబివకా’ (తోడేలు)కు 53 శాతం ఓట్లు వచ్చాయి. పులికి 27, పిల్లికి 20 శాతం ఓట్లు పడ్డాయి. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ‘జబివకా’ను మస్కట్‌గా ఎంపిక చేసినట్టు 2016 అక్టోబర్ 22న నిర్వాహణ కమిటీ అధికారులు ప్రకటించారు. ఎంపికైన మరుక్షణం నుంచే ‘జబివకా’ రష్యాలో హల్‌చల్ చేస్తున్నది. రకరకాల భంగిమల్లో కనువిందు చేస్తున్న మస్కట్‌తో ఫొటోలు తీయించుకోవడానికి అభిమానుల నుంచి సామాన్యుల వరకూ పోటీపడుతున్నారు.