క్రీడాభూమి

ఆసియా కప్‌లో టాప్-10గా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: రానున్న ఆసియా కప్‌లో టాప్-10లో నిలుస్తామని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అన్నాడు. ఆదివారం కెన్యాతో ముంబయిలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో ఎనిమిది స్ట్రయిక్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన 33 ఏళ్ల ఛెత్రీ ప్రత్యర్థిని 2-0తో ఓడించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో రానున్న ఆసియా కప్‌లోనూ బలమైన జట్టుగా నిలిచేందుకు ఇదే ఆటతీరును కనబరుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో పాల్గొనే వివిధ దేశాలతో గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అందుకు తగినవిధంగా తాము సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్ పరంగా ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ, స్వదేశంలో మంచి ఆటతీరును కనబరుస్తున్నప్పటికీ రానున్న ప్రధాన ఈవెంట్లలో ప్రత్యర్థి జట్లతో పోటీ పడేందుకుకు ఆటతీరును మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డాడు. చైనీస్ తైపీ, కెన్యా, న్యూజిలాండ్ జట్ల కంటే భారత్ జట్టు మెరుగ్గా ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, ఇరాన్ లేదా ఆస్ట్రేలియా తమకంటే చక్కని ఆటతీరును కనబరిచే జట్లుగా ఉన్నందున ప్రత్యర్థిని అంత సులభంగా అంచనా వేయడానికి వీలు లేదని అన్నాడు.
భారత జట్టు అద్భుత ప్రదర్శన : కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్
ముంబయిలో ముగిసిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భారత జట్టు సభ్యులంతా సమష్టిగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని కప్‌ను కైవశం చేసుకున్నారని జట్టు కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ అన్నాడు. అయితే, రానున్న ఏఎఫ్‌సీ ఆసియా కప్ అత్యంత కీలకం కానున్నందున ఆటగాళ్ల తీరులో మరింత మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి గ్రూప్‌లో అర్హత సాధించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఆసియా కప్ కంటే ముందుకు జరిగే వివిధ మ్యాచ్‌లలో ఆడడం ద్వారా మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.