క్రీడాభూమి

టైటిల్ వేటకు బ్రెజిల్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచీ, జూన్ 11: అత్యధికంగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రెజిల్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. టైటిల్ వేటుకు సిద్ధంగా ఉన్న ఈ జట్టు ఆటగాళ్లు వియన్నా నుంచి బయలుదేరి, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝామున మూడు గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. వరల్డ్ కప్ కోసం సిద్ధమయ్యేందుకు ఆస్ట్రియాతో ఆదివారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 3-0 తేడాతో విజయాన్ని నమోదు చేసిన తర్వాత, స్టార్ ఆటగాడు నేమార్‌సహా జట్టులోని క్రీడాకారులంతా అక్కడి నుంచి బయలుదేరారు. ప్రయాణ భారం ఏమాత్రం లేకుండా, సోచీ విమానాశ్రయంలో వారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన నేమార్‌ను చూసేందుకు విమానాశ్రయం వద్ద అభిమానులు బారులుతీరారు. ఆస్ట్రియాతో జరిగిన చివరి ఫ్రెండ్లీలో గోల్స్ చేసిన గాబ్రియెల్ జీసస్, ఫిలిప్ కొటిన్హో తదితరులు విమానాశ్రయం నుంచి నేరుగా తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఈనెల 17వ తేదీ, ఆదివారం రోజున స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ‘గ్రూప్ ఈ’ నుంచి ఈ రెండు జట్లతోపాటు సెర్బియా, కోస్టారికా జట్లు కూడా పోటీలో ఉన్నాయి.

చిత్రం..సహచరులతో కలిసి సోమవారం ఉదయం సోచీ విమానాశ్రయంలో దిగిన బ్రెజిల్ స్ట్రయకర్ నేమార్.
కాలి గాయం నుంచి అతను పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ