క్రీడాభూమి

రికార్డు దిశగా కాహిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజాన్ (రష్యా), జూన్ 14: ఆస్ట్రేలియా సీనియర్ ఫుట్‌బాలర్ టిమ్ కాహిల్ అరుదైన ఒక రికార్డును సాధించే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌లో అతను గోల్స్ చేశాడు. 38 ఏళ్ల కాహిల్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్. ఈ టోర్నమెంట్ చరిత్రలో, నాలుగు వరల్డ్ కప్స్ ఆడి, ప్రతిసారీ కనీసం ఒక గోల్ చేసిన పీలే (బ్రెజిల్), మిరొస్లావ్ క్లోస్ (జర్మనీ) సరనస స్థానం సంపాదించే అవకాశం కాహిల్‌కు ఉంది. ఫ్రాన్స్, పెరూ, డెన్మార్క్‌తో కలిసి గ్రూప్ ‘సీ’ నుంచి పోటీపడుతున్న ఆస్ట్రేలియాను ‘లాస్ట్-16’లో చేర్చడమే తన లక్ష్యమని గురువారం ఉదయం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఫిట్నెస్ కోసం తాను ఇంగ్లీష్ క్లబ్ మ్యాచ్‌లు ఆడానని, ఫలితంగా స్వదేశంలో అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నాడు. రిటైర్మెంట్‌ను పరోక్షంగా విలేఖరులు ప్రస్తావించినప్పటికీ, అతను ఏమాత్రం పట్టించుకోకుండా, తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పాల్సిందిగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, ప్రస్తుతం తాను రొటీన్ వామప్, ప్రాక్టీస్ సెషన్‌ను ముగించుకొని వచ్చానని, ఇంతకంటే ప్రత్యేకత ఏమీ లేదని అన్నాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను గెలిపించడానికి కృషి చేస్తానని అన్నాడు. ‘లాస్ట్-16’లో చోటు దక్కించుకోవడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నాడు. ఆతర్వాత మరింత ముందుకు వెళ్లడం, టైటిల్ సాధించడం తమ గమ్యాలని తెలిపాడు. పీలే వంటి అసాధారణ క్రీడాకారుడి సరసన చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తానని, అందుకే, ఈ టోర్నీలో గోల్స్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు. ఒక అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకోబోనని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్‌ను ఎవరు గెల్చుకుంటారో జోస్యం చెప్పడానికి అతను నిరాకరించాడు. ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు.

చిత్రం..టిమ్ కాహిల్