క్రీడాభూమి

అఫ్గాన్‌కు ప్రధాని మోదీ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 14: టెస్టుల్లో తొలిసారిగా ఆరంగేట్రం చేస్తున్న అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అఫ్గాన్ తొలిసారిగా టీమిండియాతో గురువారం నుంచి ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో ఆడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని అఫ్గాన్ జట్టు టెస్టు మ్యాచ్‌లలో ఆడాలని ఉవ్విళ్లూరడం అభినందనీయమని అన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లో 2001లో అఫిలియేట్ మెంబర్‌గా నమోదైన అఫ్గాన్‌లో ఎంతో రాటుదేలిన ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. మోదీ మెసేజ్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పటికే అఫ్గాన్ జట్టులోని పలువురు క్రికెటర్లు వివిధ ఫార్మట్లలో ఎన్నో విజయాలను నమోదు చేశారని పేర్కొన్నాడు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో కష్టసాధ్యమైన పరిస్థితులను కూడా సవాల్ చేసేవిధంగా ఉండేందుకు దోహదపడతాయని అన్నాడు.