క్రీడాభూమి

లంచ్‌కు ముందే సెంచరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా స్టయిలిష్ బ్యాట్స్‌మన్ రికార్డు సృష్టించాడు. లంచ్ విరామ సమయానికి సెంచరీ చేసి ఇంతవరకూ ఏ భారత క్రికెట్ సాధించని ఘనత సాధించాడు. బెంగళూరులో గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలిరోజున ఓపెనర్‌గా దిగిన ధావన్ భోజన విరామ సమయాని కంటే ముందు 91 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, 19 ఫోర్లతో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. లంచ్ విరామ సమయానికి ముందు సెంచరీ చేసిన ప్రపంచ ఆటగాళ్లలో ఆరో క్రికెటర్‌గా శిఖర్ ధావన్ రికార్డు నెలకొల్పాడు. ధావన్ ఇంతవరకు ఆడిన టెస్టు మ్యాచ్‌లలో ఏడు సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంచ్ విరామ సమయానికి ముందు సెంచరీ చేసినవారిలో విక్టర్ ట్రంపర్ 1902లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 నాటౌట్, చార్లీ మెకార్టెనే 1926లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 నాటౌట్, బ్రాడ్‌మన్ 1930లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 నాటౌట్, మజీద్ ఖాన్ న్యూజిలాండ్‌తో 1976లో జరిగిన మ్యాచ్‌లో 108 నాటౌట్ ఉన్నారు. కాగా, శిఖర్ ధావన్ కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్ 2006లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులు చేశాడు. ఇదిలావుండగా, టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి ముందు సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్‌ను బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి అభినందించారు.