క్రీడాభూమి

ఆరంభం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియా నుంచి వేలాదిగా అభిమానులు తరలి రావడంతో రష్యాతో ఆ జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడినపుడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో మ్యాచ్ సజావుగా సాగిపోయింది. 2016 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో రష్యా హూలిగల్‌ను విచక్షణారహితంగా ఇంగ్లాండ్ అభిమానులపై దాడులకు దిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ సాకర్ నిర్వాహణ బృందం మరింత అప్రమత్తమైంది. ఇంగ్లాండ్ అభిమానులు ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉన్నందున అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించింది. వరల్డ్ కప్ దిగ్విజయంగా నిర్వహిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మాస్కో, జూన్ 14: ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఇక్కడి లుజ్నికీ స్టేడియంలో గురువారం అట్టహాసంగా మొదలైంది. జూలై 15వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 32 జట్లు టైటిల్ వేటను కొనసాగించనున్నాయి. రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య మొదటి మ్యాచ్ మొదలుకావడానికి ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీని మాంచెస్టర్ యునైటెడ్‌కు ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన స్పెయిన్ మాజీ ఆటగాడు ఇకర్ కాసిలాస్ వేదికవద్దకు తీసుకొస్తున్నప్పుడు స్టేడియం మొత్తం చప్పట్లో మారుమోగింది. బ్రెజిల్ మాజీ ఆటగాడు రొనాల్డో వీఐపీ గ్యాలరీకి వెళుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో అతని పట్ల ఉన్న అభిమానానాన్ని చాటుకున్నారు.
బ్రిటిష్ పాప్ సింగర్ రాబీ విలియమ్స్ రాకతో లుజ్నికీ స్టేడియం కొత్త అందాలను సంతరించుకుంది. సుమారు 500 మంది డాన్సర్లతో అతను తన సంగీత విభావరిని ‘లెట్ మీ ఎంటెర్‌టైన్ యూ’ పాటతో మొదలు పెట్టాడు. ఆతర్వాత పాప్ మ్యూజిక్‌తో, డాన్సర్ల స్టెప్పులతో స్టేడియం మారుమోగింది. ప్రేక్షకులు సైతం వారితో జత కలిసి చిందులు వేశారు. రష్యన్ సింగర్ ఐదా గారిఫిలినాతో కలసి విలియమ్స్ పాడిన ఏంజిల్స్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వరల్డ్ కప్‌లో తాను కూడా భాగస్వామ్యం కావాలన్నది తన చిరకాల
కోరికగా ప్రకటించిన విలియమ్స్ ఈ రకంగా ఆ కోరిక నెరవేరిందని అన్నాడు. బ్రెజిల్ లెజండరీ ఆటగాడు రొనాల్డో, రష్యా సిటీ ప్రముఖుడు ఎలెక్స్ మెఖలొవ్, దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు ఈ కార్యక్రమంలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు.
స్టేడియానికి పరుగు..
టికెట్ కొనుకున్న ఎంతో మంది అభిమానులు గురువారం మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు క్యూలు కట్టారు. ముందు వెళితే, స్టేడియంలో ముందు వరుసలో కూర్చునే అవకాశం ఉంటుదన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ స్టేడియానికి పరుగులు తీశారు. రష్యా జాతీయ పతాకాన్ని కొంత మంది చేత్తో పట్టుకుంటే, మరికొంత మంది ముఖానికి టాటూలు వేయించుకున్నారు. ఎటు చూసినా భారీగా అభిమానులు బారులుతీరి కనిపించడంతో, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయేమోనన్న అనుమానంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1980లో సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత రష్యాలో జరుగుతున్న అతి పెద్ద ఈవెంట్ ఇదే కావడంతో పుతిన్ ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల కాలంలో డోపింగ్ ఆరోపణలు వెలుగులోకి రావడం, ప్రభుత్వమే క్రీడాకారులకు ఉత్ప్రేరకాలను అలవాటు చేస్తున్నదని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) నివేదిక స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రతిష్ఠ కోల్పోయిన రష్యా మళ్లీ ప్రపంచ క్రీడాభిమానుల మద్దతను సంపాదించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. నిజాయితీని నిరూపించుకోవడానికి, సామర్థ్యాన్ని చాటుకోవడానికి వరల్డ్ కప్ సాకర్‌ను వేదికంగా ఎంచుకుంది. అందుకే, ప్రతి అంశాన్నీ ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరకుండా జాగ్రత్త పడుతున్నది. ఇప్పటికే ఐదుపర్యాయాలు చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న బ్రెజిల్ ఈసారి సూపర్ స్టార్ నేమార్ సాయంతో ఆరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ మరోసారి ట్రోఫీ కోసం పోరాడనుంది. ప్రపంచ మేటి ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తమను గెలిపిస్తాడని వారు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఆశతో ఉన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేకపోయినా, ఈ టోర్నీలో జరిగే ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపుతుందనేది వాస్తవం. వివిధ దేశాల నుంచి కనీసం ఆరు లక్షల మంది అభిమానులు వరల్డ్ కప్‌ను చూసేందుకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, వసతి, ఇతరత్రా సౌకర్యాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది.