క్రీడాభూమి

అట్టహాసంగా ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో : క్రీడారంగంలోనే అతి పెద్ద ఈవెంట్ ప్రపంచ కప్ సాకర్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 80,000 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన లుజ్నికీ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ మొదలైనట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. సుమారు 13 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం రష్యా అన్నివిధాల సిద్ధమైంది. పుతిన్ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చిన అలెక్సీ నావల్నీ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. నెలరోజులు జైలులో గడిపిన నావల్నీని ఆహ్వానించడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంటు నిర్వహించాలన్న రష్యా ఆలోచనలకు అద్దం పడుతోంది. బ్రిటిష్ పాప్‌స్టార్ రాబీ విలియమ్స్ సంగీత విభావరితో మొదలైన ప్రారంభోత్సవం చివరివరకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రష్యా చరిత్రను, సాకర్ గొప్పతనాన్ని వివరించే రీతిలో ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.