క్రీడాభూమి

‘ఒకే ఓటు’ విధానంతో తిప్పలు తప్పవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: లోధా కమిటీ సూచించిన విధంగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అన్న విధానాన్ని అమలుచేస్తే సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవని సుప్రీం కోర్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను యథాతథంగా అమలు చేయాల్సిందిగా ఇది వరకే బిసిసిఐకి సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రతిపాదనల్లో కొన్ని ఆచరణ సాధ్యం కాదని బిసిసిఐ వాదిస్తున్నది. పలు అంశాలను ప్రస్తావించిన బోర్డు తాజాగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న నిబంధనపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఆ విధానాన్ని అమలు చేస్తే సమస్యలు పెరుగుతాయని పేర్కొంది. రాష్ట్రానికి ఎవరు ప్రాతినిథ్యం వహించాలన్న విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంటుందని, దీనితో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

సన్‌రైజర్స్ పేసర్
శరణ్‌కు జరిమానా
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ బరీందర్ శరణ్‌పై జరిమానా విధించారు. ముంబయి బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన శరణ్ హేళన చేస్తూ పెవిలియన్‌వైపు దారి చూపాడు. ఈ సంఘటనపై ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదును అందుకున్న ఐసిసి మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అతని మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా విధించాడు. శరణ్ పొరపాటు చేసినట్టు అంగీకరించడంతో తక్కువ జరిమానాతో విడిచిపెట్టామని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని శ్రీనాథ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు సహజమేనని పార్థీవ్ పటేల్ అన్నాడు. ఆ సంఘటనకు తాను ప్రాధాన్యం ఇవ్వడం లేదని అతను స్పష్టం చేశాడు.

విశాఖలో ఐపిఎల్
షెడ్యూల్ ఖరారు
మూడు మ్యాచ్‌లు ఆడనున్న పుణె
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 19: విశాఖలో జరిగే ఐపిఎల్ షెడ్యూల్ ఖరారైంది. ఇక్కడ మూడు మ్యాచ్‌లు జరుగుతాయ. మహారాష్టల్రో నెలకొన్న నీటి కరవు కారణంగా అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయ వేదికగా విశాఖను రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు ఎంపిక చేసుకుంది. పుణె జట్టు విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ, విడిసిఎ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడేందుకు సమ్మతి తెలిపింది. వచ్చేనెల 10, 17, 21 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్‌లెవెన్ పంజాబ్ జట్లతో విశాఖ స్టేడియంలో పుణె తలపడనుంది. మే 10న జరిగే మ్యాచ్‌లో పూణే జట్టు హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుతో ఢీ కొంటుంది. మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మే 17న రెండో మ్యాచ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. చివరగా మే 21న పూణే జట్టు కింగ్స్‌లెవెన్ పంజాబ్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకంగా మూడు మ్యాచ్‌లు జరగనుండడంతో విశాఖ క్రికెట్ అభిమానులు ఆనందంతో ఉక్కిరిక్కిరి అవుతున్నారు.