క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్లో ఆరుగురు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: మంగోలియాలో జరుగుతున్న ఉలాన్‌బాతర్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆరుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల విభాగంలో ఆశిష్ (64 కేజీలు), మన్‌దీప్ జంగ్రా (69 కేజీలు), సల్మాన్ షేఖ్ (52 కేజీలు), శివతోపాటు మహిళల విభాగంలో జాతీయ చాంపియన్ సర్జుబాల దేవి (51 కేజీలు), సీనియర్ బాక్సర్ సరితాదేవి క్వార్టర్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నారు. మూడుసార్లు ఆసియా మెడలిస్టు శివ స్థానిక బాక్సర్ ఒయూన్‌బిలెగ్ ముంఖ్‌సైఖాన్‌పై ఏకపక్షంగా గెలవగా, సల్మాన్ రెండు రౌండ్లలో కొరియాకు చెందిన యంగ్ సిక్ బాయెను, మన్‌దీప్ చైనీస్ తైపీ హంగ్ మింగ్ పాన్ రెండు రౌండ్లలోనే మట్టి కరిపించాడు. సర్జుబాల చైనాకు చెందిన యు యహోంగ్‌ను, సరితాదేవి మంగోలియాకు చెందిన పురెవ్‌జావ్ దావాను ఓడించారు.
జర్మన్ బాక్సింగ్ టోర్నీ:
క్వార్టర్స్‌లోకి భారత బాక్సర్
కామనె్వల్త్ గేమ్స్ గోల్డ్‌మెడలిస్టు వికాస్ కృష్ణన్ (75 కేజీలు) జర్మనీలోని హాలేలో జరుగుతున్న కెమిస్ట్రీ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. 26 ఏళ్ల వికాస్ తన ప్రత్యర్థి ఐర్లాండ్‌కు చెందిన నెవిన్ మిచెల్‌ను తన ఓపెనింగ్ బౌట్‌లో ఓడించాడు.