క్రీడాభూమి

వార్ ఎక్కువ.. కిక్కు తక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యెకాటెరిన్‌బర్గ్ (రష్యా), జూన్ 20: ప్రపంచాన్ని ఊపేస్తున్న ఫీవర్ ఫిఫా వరల్డ్ కప్ 2018. డిఫెండింగ్ చాంపియన్లు, హాట్ పేవరేట్లు, గ్రూపు ఫేవరేట్లు, ఆయా జట్లలో స్టార్ ఆటగాళ్లు.. ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఎన్ని చేస్తారు.. అనుసరిస్తున్న వ్యూహాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. రష్యాలో లైవ్ చూస్తున్నా, ఇళ్లలో టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు పరికిస్తున్నా ఈ సీజన్ హాట్ టాపిక్ మాత్రం ఫిఫా వరల్డ్ కప్. ఇదంతా ఒక ఎత్తయితే, ఇంకా ఏదో మిస్సవుతున్నామన్న ఫీలింగ్ అభిమానులను వెంటాడుతోంది. ఆ మిస్సవుతున్న ఫీలింగే -నరాలు తెంపే ఉత్కంఠ. టాప్ జట్లతో చిరు జట్లు సైతం వీరోచితంగా పోరాడుతున్నా, చిన్న దేశాలు సైతం అనూహ్యంగా గోల్స్ చేస్తున్నా గతంలోని ఉత్కంఠ ఇప్పుడు లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం -వీడియో అసిస్టెంట్ రిఫరీ (వార్). ఆటలో పొరబాట్లు జరగకుండా కచ్చితమైన నిర్ణయంతో రిఫరీలు తీర్పునిచ్చేందుకు ఈ వరల్డ్ కప్ సీజన్ నుంచి సీన్‌లోకి దిగిన సాంకేతిక రిఫరీయే -వీఏఆర్. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఈ వార్ కారణంగా ఉత్కంఠ మిస్సవుతున్నామన్న చిన్న అసంతృప్తి వెంటాడుతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. దీనికి ‘సెట్ పీసెస్’ అన్న టైటిల్ పెట్టి మరీ చర్చించుకుంటున్నారు. ఎందుకు? అన్న ప్రశ్నకు బలంగా చెప్తోన్న సమాధానం -ఇప్పటి వరకూ జరిగిన ఆటలో సగం గోల్స్ వార్ నిర్ణయించినవే కావడం. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఫిఫా వరల్డ్‌కప్‌లోకి అడుగు పెట్టిన దేశాలన్నీ దాదాపుగా ఇప్పటికి ఒక మ్యాచ్ ఆడేశాయి. విజయ పోరాటంలో ఇన్ని దేశాలు చేసిన గోల్స్‌లో సగభాగం వార్ నిర్ణయంతో సాగినవేనట. ఉదాహరణకు రెండు దేశాలు గెలుపు కోసం చేస్తున్న అలుపెరుగని పోరాటంలో చిన్న పొరబాటు జరగొచ్చు. దాన్ని రిఫరీ గమనించి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఆ నిర్ణయాన్ని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ప్రశ్నించినపుడు, కచ్చితమైన నిర్థారణ కోసం సమస్య వార్ దగ్గరకు వెళ్తుంది. నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకున్నా, వీడియో అసిస్టెంట్ రిఫరీ మాత్రం వాస్తవాన్ని రిఫరీకి వివరిస్తాడు. అప్పుడు రిఫరీ ప్రకటించే నిర్ణయంతో ఫ్రీకిక్ పొందిన జట్టు గోల్ చేసుకునే అవకాశం పొందుతుంది. ఇప్పటి వరకూ పడిన గోల్స్‌లో సగభాగం ఇదే కావడంతో, సహజంగా జరిగే పోరాటంలోని మజా ఆటలో మిస్సవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆరంభమ్యాచ్‌లో రష్యా సాధించిన ఐదు గోల్స్‌లో అధిక శాతం ఈ తరహా ఫ్రీకిక్స్ నుంచి లభించినవే. ఈ చర్చపై సెనెగల్ జట్టు కోచ్ ఆలియో సిస్సీ ‘వివిధ దేశాల జట్లు డిఫెన్సివ్ సిస్టమ్ వ్యూహానే్న అనుసరిస్తున్నాయి. అందుకే గ్రూప్ మ్యాచుల్లో ‘సెట్ పీసెస్’ నిర్ణయాత్మక ఆయుధాలవుతున్నాయి’ అని వ్యాఖ్యానించాడు. దక్షిణ కొరియాతో తలపడిన స్వీడన్ జట్టుకు దక్కిన విజయం కూడా వార్ కారణంగానే అని చెప్పాలి. ఫుట్‌బాల్ విశే్లషణా సంస్థ ఆప్టా స్పోర్ట్స్ చెప్తోన్న దాని ప్రకారం ఇప్పటి వరకూ 58.3 శాతం అంటే 26 గోల్స్ సెట్ పీసెస్‌లే. ‘ఈ అసాధారణ అంశాలు ఫుట్‌బాల్ అభిమానులను ఎలాంటి ఆనందాన్ని అందివ్వలేకపోతున్నాయి’ అంటూ పలువురు నిపుణులు వ్యాఖ్యానించడాన్ని చూస్తుంటే, వార్ కారణంగా దక్కుతోన్న ‘సెట్ పీసెస్’ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో అర్థమవుతుంది.