క్రీడాభూమి

ఘనంగా రియో ఒలింపిక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, ఏప్రిల్ 20: రియో ఒలింపిక్స్ నిర్వాహణలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నాడు. బ్రెజిల్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ ఘనంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశాడు. స్పోర్ట్‌అకార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతను మాట్లాడుతూ బ్రెజిల్ రాజకీయ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న విషయం నిజమేనని అన్నాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇవి తాత్కాలిక సమస్యలని, ఒలింపిక్స్ నిర్వాహణకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పాడు. ఒలింపిక్స్ విజయవంతమవుతాయని జోస్యం చెప్పాడు.