క్రీడాభూమి

దగ్గరపడ్డాడు! 10వేల పరుగుల క్లబ్‌లో ధోనీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 11: టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. టీమిండియాలో సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనతను దక్కించుకున్నారు. ధోనీ మరో 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఈనెల 12నుంచి ఆతిధ్య జట్టుతో మూడు వనే్డ మ్యాచ్‌లలో ఆడనుంది. తొలి వనే్డ నాట్టింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జిలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశం వస్తే 10 వేల పరుగుల క్లబ్‌లో చేరడం ఖాయం. వనే్డలలో 10 వేల పరుగులు చేసిన వారిలో సచిన్ తెండూల్కర్ (18426) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో కుమార సంగక్కర-శ్రీలంక (14234), రికీ పాంటింగ్-ఆస్ట్రేలియా (13704), సనత్ జయసూర్య-శ్రీలంక (13430), మహేల జయవర్ధనే-శ్రీలంక (12650), ఇంజమామ్ ఉల్ హక్-పాకిస్తాన్ (11739), జాక్వెలిస్ కలిస్-దక్షిణాఫ్రికా (11579), సౌరవ్ గంగూలీ-్భరత్ (11363), రాహుల్ ద్రవిడ్-్భరత్ (10889), బ్రియాన్ లారా-వెస్టిండీస్ (10405), తిలకరత్నే దిల్షాన్-శ్రీలంక (10290) ఉన్నారు. కాగా, ధోనీ మరో 33 పరుగులు చేసి పదివేల క్లబ్‌లో చేరితే ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో చోటుదక్కించుకుంటాడు.