క్రీడాభూమి

డెల్ పొట్రో ప్రతిభావంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 12: జువాన్ డెల్ పొట్రో ప్రతిభావంతుడని, ఎంతటి ఆటగాళ్లనైనా నిలువరించే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కితాబునిచ్చాడు. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల క్వార్టర్ ఫైనల్‌లో అతి కష్టం మీద డెల్ పొట్రోను 7-5, 6-7, 4-6, 6-4, 6-4 తేడాతో ఓడించి, సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌తో పోరును ఖాయం చేసుకున్న నాదల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఎంతో కష్టపడ్డానని అన్నాడు. డెల్ పొట్రోను పోరాట యోధుడిగా అతను అభివర్ణించారు. ప్రత్యేకించి, చివరి సెట్‌లో అతను ఆడిన తీరు అద్భుతమని అన్నాడు. జపాన్ ఆటగాడు కెయ్ నిషికొరిని 6-3, 3-6, 6-2, 6-2 స్కోరుతో ఓడించి సెమీస్ చేరిన జొకోవిచ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌పై మాట్లాడేందుకు ప్రత్యేకించి ఏమీ లేదని అన్నాడు. అన్ని మ్యాచ్‌ల్లాగానే అది కూడా ఒకటని వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకడైన స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్‌ను ఒక మారథాన్ క్వార్టర్ ఫైనల్‌లో 2-6, 6-7, 7-5, 56-4, 13-11 ఆధిక్యంతో ఓడించిన దక్షిణాఫ్రికా వీరుడు కెవిన్ ఆండర్సన్ మరో సెమీ ఫైనల్‌లో జాన్ ఇస్నర్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇస్నర్ తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మిలోస్ రోనిక్‌పై 6-7, 7-6, 6-4, 6-3 ఆధిక్యంతో విజయం సాధించాడు.

చిత్రం..రాఫెల్ నాదల్