క్రీడాభూమి

ఫైనల్‌కు సెరెనా, కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 12: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజిలిక్యు కెర్బర్ తన ప్రత్యర్థి, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ జెలెనా ఒస్తాపెంకోను 6-3, 6-3తో ఓడించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్తాపెంకో ఏకోశానా కెర్బర్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. సెమీస్‌లో గెలుపుతో కెర్బర్ వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ పోటీలో తాను తొలినుంచి చక్కని ఆటతీరును కనబరిచానని, ఫైనల్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని కెర్బర్ పేర్కొంది. శనివారం జరిగే ఫైనల్‌లో ఆమె అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌తో తలపడుతుంది.
మహిళల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి, జర్మనీ క్రీడాకారిణి జూలియా జార్జెస్‌పై 6-2, 6-4 తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్‌లో గెలుపుతో 23సార్లు చాంపియన్‌షిప్ గెల్చుకున్న సెరెనా 30వసారి గ్రాండ్ శ్లామ్ ఫైనల్‌కు చేరుకుంది. 10సార్లు వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న సెరెనా ఇప్పటికే ఏడుసార్లు చాంపియన్‌గా అవతరించి, ఇపుడు మరోసారి వింబుల్డన్ కిరీటం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సెమీఫైనల్స్‌లో గెలుపుతో సెరెనా శనివారం జరిగే ఫైనల్ పోరులో జర్మన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 10 క్రీడాకారిణి ఏంజిలిక్యూ కెర్బర్‌తో పోటీపడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం సెరెనా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత జరిగిన గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం గర్వంగా ఫీలవుతున్నానని, ఏడాది కాలంలో ఆడుతున్న నాలుగో టోర్నీలోనే ఇంత అద్భుతంగా తాను ఆడతానని భావించలేదని పేర్కొంది.

చిత్రాలు.. సెరెనా, కెర్బర్