క్రీడాభూమి

రాత్రికి రాత్రే హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 12: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఫార్వార్డ్ క్రొయేషియా ఆటగాడు మారియో మాడ్జుకిక్ రాత్రికి రాత్రే ఒక్కసారే హీరో అయిపోయాడు. ఇక క్రొయేషియా జట్టు విషయానికి వస్తే...నాలుగు మిలియన్లు (దాదాపు 40 లక్షలు) జనాభా కలిగిన ఈ చిన్నదేశం తొలిసారిగా ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్‌కు చేరుకుంది. 1950లో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన చిన్న దేశంగా ఇప్పటివరకు ఉరుగ్వే జట్టు చరిత్ర సృష్టించింది. మళ్లీ 68 సంవత్సరాల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల్లో దిగిన మరో చిన్నదేశంగా ఇపుడు క్రొయేషియా ఆ ఘనతను దక్కించుకుంది. ఈ అద్భుతాన్ని కళ్ల ముందు ఆవిష్కరించిన మారియో సెలబ్రిటీగా మారిపోయాడు. అభిమానులంతా అతని పేరునే భజన చేస్తున్నారు. వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు అంతంత మాత్రంగానే అభిమానులకు తెలిసిన ఈ ఆటగాడు ఇప్పుడు వారి దృష్టిలో హీరో అయ్యాడు. ఇక ఈ జట్టు ఫైనల్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.