క్రీడాభూమి

భారత బాక్సర్లు ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: సెర్బియాలోని సబొటికాలో జరుగుతున్న వొవొడినా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అప్రతిహతంగా దూసుకెళ్తున్నారు. అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల సాధనవైపు దూసుకెళ్తున్నారు. ఏకంగా తొమ్మిది మంది బాక్సర్లు తమ తమ క్వార్టర్ ఫైనల్స్‌ను సమర్థంగా ముగించుకొని సెమీ ఫైనల్ చేరారు. వీరిలో ఆరుగురు మహిళలు కావడం విశేషం. టోర్నీ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిన వారికి కాంస్య పతకం లభిస్తుంది. దీంతో భారత్‌కు కనీసం తొమ్మిది కాంస్యాలు ఖాయమయ్యాయి.
క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడిన భారతీయుల్లో ఆస్టా పవా (75 కిలోల విభాగం) మాత్రమే పరాజయాన్ని ఎదుర్కొన్నారు. నీతూ (48 కిలోలు), దివ్య పవార్ (54 కిలోలు), జ్యోతి (51 కిలోలు), అనామిక (51 కిలోలు), సాక్షి (57 కిలోలు), మనీష (64 కిలోలు) మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో విజయాలను సాధించి ముందంజ వేయగా, పురుషుల విభాగంలో వరుణ్ సింగ్ (49 కిలోలు), భావేష్ కట్టిమణి (52 కిలోలు), విజయ్‌దీప్ (69 కిలోలు) తమతమ విభాగాల్లో గెలుపొంది, సెమీస్‌లోకి అడుగుపెట్టారు.