క్రీడాభూమి

దంచుతున్న భారత బాక్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: సెర్బియాలో జరుగుతున్న 36వ గోల్డెన్ గ్లోవ్ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా నడుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో 13మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు. ఫైనల్‌కు చేరిన వారిలో జ్యోతి గులియా (51కేజీలు), అకాష్ కుమార్ (75కేజీలు), అంకిత్ (60కేజీలు), ఆకాష్ (64కేజీలు), విజయ్‌దీప్ (69కేజీలు), నితిన్ కుమార్ (75కేజీలు), ఎస్ భరుణ్ సింగ్ (49కేజీలు), అమాన్ (91కేజీలు), నీతు (48కేజీలు), దీవ్య పవార్ (54కేజీలు), మనీషా (64కేజీలు), లలిత (69కేజీలు), నేహా యాదవ్ (81+) ఉన్నారు. ఫైనల్ బౌట్‌లో భారత బాక్సర్లకే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.