క్రీడాభూమి

ప్రపంచ చాంపియన్లకు ఫ్రాన్స్.. హార్టీ వెల్‌కమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 17: ప్రపంచకప్ పట్టుకొచ్చిన హీరోలని చూసి ఫ్రాన్స్ పొంగిపోయింది. ఆటగాళ్లు కాదురా.. మీరే ఫ్రాన్స్ పోటుగాళ్లంటూ కితాబులిచ్చింది. అదిగదిగో.. టాప్‌లెస్ బస్సులో ఈఫిల్ టవర్లు వస్తున్నాయంటూ జేజేలు పలికింది. ఫ్రాన్స్ ప్రథమ పౌరుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మొదలు బుడిబుడి అడుగులేసే బుడతడి వరకూ ఆటగాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న విజయదరహాసం చూసి మురిసిపోయారు. చాంప్స్ ఎలిసీస్ నుంచి ప్రసిడెన్షియనల్ భవనం వరకూ.. జట్టు చుట్టూవున్న అభిమానజనం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూనే ఉంది.
ఒకటా రెండా.. 20 ఏళ్ల తరువాత ఫ్రాన్స్‌కు అందిన ఓ కొత్త ఉత్సాహమది. ఆశల్ని వరల్డ్ కప్ ట్రోఫీగా మలచి మోసుకొచ్చిన చాంపియన్లు వాళ్లు. అందుకే -ఫ్రాన్స్‌లో ఓ అద్భుత వాతావరణం ఆవిష్కృతమైంది.
‘వావ్.. నాకు పిచ్చెక్కిపోతోంది. ఆటగాళ్లు ఎంతందంగా ఉన్నారో.. అచ్చం ఫ్రాన్స్‌లాగ’ అంటూ జట్టును చూసిన ఓ టీనేజ్ గాళ్ జులియా చేసిన వ్యాఖ్య ఇది. బహుశ, లక్షలాది అభిమానుల మూడ్స్‌కి ఆ కామెంట్ ప్రతిధ్వని అనుకోవచ్చు. జనకోలాహలం మధ్య సాగిన ఊరేగింపులో ఆటగాళ్లకు దక్కిన అత్యద్భుత గౌరవం -స్మోక్ ఫ్లాగ్. ఎయిర్ ఫోర్స్ ఆక్రోబేటిక్ యూనిట్ తొమ్మిది జెట్ విమానాలతో ఆర్క్ డె ట్రోంపే మీదుగా నీలం, తెలుపు, ఎరుపు రంగుల పొగతో ఫ్లాగ్‌ను ఆవిష్కరించి ఆటగాళ్లను సత్కరించింది. అక్కడి నుంచి అధ్యక్ష భవనానికి చేరుకునేముందు జట్టు మొత్తం బ్లూ సూట్‌లోకి మారింది. అధ్యక్ష దంపతులు మాక్రోన్, బిగట్టెలను లాంఛనంగా కలుసుకుని ఫ్రాన్స్ హీరోలు ఫొటోలు దిగారు.
‘జగజ్జట్టుకు అభినందనలు. వీళ్లు అందంగానే కాదు, ఐక్యంగా ఉన్నారు’ అని జట్టును చూపిస్తూ అధ్యక్షుడు మాక్రోన్ అభిమాన జన సందోహాన్ని ఉర్రూతలూగించాడు.
‘ఇది నిజం. మేం పిచ్‌మీదకు వెళ్లేటప్పుడే చెప్పాం, అన్ని జట్లనూ ఓడించి వస్తామని. ప్రపంచకప్ సాధించాం’ అంటూ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బ ఆనందం వ్యక్తం చేశాడు. అట్టహాసంగా సాగిన ఆహ్వాన వేడుకలో కొంతమంది పిల్లలు ప్రపంచకప్‌ను తాకేందుకు ఉత్సుకత చూపించారు.