క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌లో క్రీడాకారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే దిశగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం ఐఓఏ సంబంధిత కోర్, లీగల్ కమిటీలతో సమావేశం కానుంది. రానున్న ఆసియా క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా క్రీడాకారుల ఎంపికలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళతరం చేసే విషయమై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చంచనున్నారు.
క్రీడలతోపాటు క్రీడాకారులకు మరింత ఎక్కువ శాతం ప్రయోజనం చేకూర్చడంతోపాటు రానున్న వివిధ ఈవెంట్లలో పతకాల సంఖ్య పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓను కోరింది. ఇంతవరకు ఉన్న నిబంధనలను రానున్న రోజుల్లో సరళతరం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ఫెడరేషన్లు గత ఆరు నెలలుగా ఆయా క్రీడాంశాల్లో ప్రతిభ కనబరచిన వారి పేర్లను పరిశీలించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ విషయమై ఇటీవల జారీ అయిన సర్క్యులర్‌తో డైలమాలో పడిన ఐఓఏ, ఒలింపిక్ కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించేందుకు వీలుగా కోర్, లీగల్ కమిటీలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించాయి. శుక్రవారం జరిగే సమావేశంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజా ప్రతిపాదనలు రావడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని, పోటీలకు తాము ఎక్కువమంది అథ్లెట్లను పంపించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటే, అంగీకరించడం లేదా తిరస్కరించడం జరిగేదని, అయితే, కానీ ఈ అంశంపై చర్చించడం ద్వారా ముందుకు సాగుతామని ఇండియన్ ఒలింపిక్ కమిటీ కార్యదర్శి రాజీవ్ మెహతా పీటీఐకి తెలిపాడు.
ఈ సమావేశానికి ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్ర, ప్రిపరేషన్ ప్యానల్ చైర్మన్ లలిత్ భానోత్ హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే ఐఓఏ ఇటీవల 524 మందితో కూడిన భారీ అథ్లెట్ల బృందాన్ని ప్రకటించింది.