క్రీడాభూమి

భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 19: వచ్చే నెల 1 నుంచి 5 వరకు భారత్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్, డైనమిక్ మిడిల్ ఫీల్డర్ బెన్ స్టోక్స్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.గత ఏడాది సెప్టెంబర్‌లో బ్రిస్టోల్‌లోని నైట్‌క్లబ్ బయట జరిగిన ఒక సంఘటనలో బాధ్యుడిని చేస్తూ బెన్‌స్టోక్స్‌ను ప్రాసిక్యూషన్ విచారణకు ఆదేశించింది.
అయితే, ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిరపరాధినని అతని వాదించినా ఈ కేసు వచ్చేనెల 6న విచారణకు రానుంది. ఇదే సమయంలో భారత్ ఆతిధ్య ఇంగ్లాండ్‌తో ఆడే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 1 నుంచి తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బెన్‌స్టోక్స్ కేసు కేసు ఆగస్టు 6న విచారణ రానుండడంతో తొలి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశాలు లేకపోవచ్చునని తెలుస్తోంది. మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్‌లలో మాత్రం బెన్ స్టోక్స్ ఆడతాడు. భారత్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ 2-1తో ఇంగ్లాండ్ చేజిక్కించుకోవడంలో బెన్‌స్టోక్స్ కీలకంగా మారాడు. ఇదిలావుండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం కోర్టు కేసు నుంచి బెన్ స్టోక్ బయటపడతాడని విశ్వసిస్తున్నాడు.