క్రీడాభూమి

ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరప్రదేశ్‌లో ఆటగాళ్ల ఎంపికలో లంచం తీసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, అతని వ్యక్తిగత సిబ్బంది రాజీనామా చేయాలని ఒత్తిడి వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఆటగాళ్లకు ప్రయోజనం చేకూర్చే నిమిత్తం రాజీవ్ శుక్లా, అతని వ్యక్తిగత సిబ్బంది అక్రమ సైఫీ, క్రికెటర్ రాహుల్ శర్మ ఫోన్‌లో జరిపిన సంభాషణను ఒక హిందీ న్యూస్ చానల్ ప్రసారం చేసిన విషయం క్రీడారంగాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్‌ను సస్పెండ్ చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. శుక్లా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొంతమంది ఆటగాళ్లకు లబ్ధి చేకూర్చేందుకు నగదు, ఇతర మార్గాల్లో ప్రయోజనం పొందేందుకు శుక్లా ప్రయత్నించారన్న అభియోగాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ శుక్లాను ఐపీఎల్ చైర్మన్ పదవినుంచి తొలగించింది.
శుక్లా వ్యక్తిగత సిబ్బందిలో అక్రమ్ సైఫీ తన పదవికి రాజీనామా చేయడంతో తక్షణం ఇది అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపాడు. కాగా, ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాడు. శుక్లా, అతని సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సదరు చానల్ నుంచి ఆయా ఆడియో టేప్‌లను పరిశీలించిన తర్వాత ఇందులో ఎవరి ప్రమేయం ఉందన్న విషయం వెల్లడిస్తామని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశాడు. కాగా, తమ రాష్ట్ర క్రీడాకారుల ఎంపికలో కొంతమందికి మేలు చేకూర్చే విధంగా రాజీవ్ శుక్లా, అక్రమ్ సైఫీ, క్రికెటర్ రాహుల్ శర్మ ప్రయత్నించారన్న ఆరోపణలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటర్ యుధ్‌వీర్ సింగ్ అన్నాడు. క్రీడాకారుల ఎంపికలో తాము పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని, ఈ విషయంలో ఎలాంటి బహిరంగ విచారణకైనా తాము సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు.