క్రీడాభూమి

సాహా భుజానికి సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 19: ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చేతి వేలికి తగిలిన గాయంతో కోలుకుంటున్న భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఇపుడు భుజం నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో వచ్చేనెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లతోపాటు ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పీటీఐకి తెలిపాడు. భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నందున లండన్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కొంతకాలం పాటు ఫిజియోథెరపీ ట్రీట్‌మెంట్ తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అప్పటికి పూర్తిగా కోలుకుంటేనే తదుపరి మ్యాచ్‌లలో సాహా బ్యాట్ పట్టుకునే అవకాశం ఉంది. అయితే, అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని వృద్ధిమాన్ సాహా ఇటీవల ట్విట్టర్ వేదికగా గాయాల దెబ్బలు తన కెరీర్‌ను కొంత దెబ్బతీశాయని వాపోతూనే భుజానికి శస్త్ర చికిత్స అనంతరం సంపూర్ణంగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన సాహా ఒక మ్యాచ్‌లో చేతి బొటనవేలికి గాయంతో బాధపడ్డాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన సందర్భంగా ఒక మ్యాచ్‌లో క్యాచ్ పట్టబోయిన సాహా తొలిసారిగా భుజానికి నొప్పితో బాధపడ్డాడు. అయినా ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోకపోవడంతో భుజం నొప్పి మరింత ఎక్కువై దక్షిణాఫ్రికా టూర్ నుంచి వెనకకు వచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడుతున్న సందర్భంగా చేతి వేలికి గాయం కారణంగా లీగ్ దశ నుంచే నిష్క్రమించాడు.
ఇదిలావుండగా, సెలక్షన్ కమిటీ కన్వీనర్ అమితాబ్ చౌదరి (యాక్టింగ్ సెక్రెటరీ)కి మాత్రం వృద్ధిమాన్ సాహా భుజం నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్టు నేషనల్ క్రికెట్ అకాడమీగానీ, సెలక్టర్ల నుంచిగానీ వాస్తవ సమాచారం అందలేదు. అయితే, సెలక్షన్ కమిటీ సమావేశం తర్వాత సాహాకు జరిగిన గాయం, అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని బీసీసీఐ ఉన్నతాధికారి పేర్కొన్నాడు.