క్రీడాభూమి

ఖేలో.. స్కాలర్‌షిప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో క్రీడాప్రాధాన్యతను పెంచి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రూపొందించిన కార్యక్రమం ఖేలో ఇండియా. ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 734మంది అథ్లెట్లకు స్కాలర్‌షిప్ మంజూరు చేస్తున్నట్టు భారత క్రీడాభివృద్ధి సంస్థ (ఎస్‌ఏఐ) ఆదివారం ప్రకటించింది. క్రీడా నైపుణ్యానికి పదును పెట్టడంతోపాటు, గాయాలకు తగిన చికిత్స చేయించుకోడానికి ఏటా ఒక్కో క్రీడాకారుడికి 1.2 లక్షల వంతున స్కాలర్‌షిప్ చెల్లిస్తారు. ప్రభుత్వ అధీకృత అకాడమీల్లో శిక్షణనిచ్చి, టోర్నీలకూ తీసుకెళ్తారు. దేశంలో క్రీడా ప్రాధాన్యతను పెంచేందుకు తొలిసారి అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో హైపవర్ ‘టాలెంట్ ఐడెంటిఫికేషన్ కమిటీ (టిఐసి)’ని ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధి, ప్రోత్సాహానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.